భాగ్యలక్ష్మి దేవాలయంలో యోగి
ప్రత్యేక పూజలు నిర్వహించిన యూపి సిఎం
Jul 3, 2022, 09:49 IST
| అమ్మ వారికి మొక్కు తీర్చుకునేందుకు వచ్చా :
*చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి*
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న సీఎం యోగీ.. ఆదివారం ఉదయం భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గతంలో మొక్కు ఉన్నందుకు సీఎం యోగీ అమ్మవారి ఆలయానికి వచ్చారని బీజేపీ నేతలు వెల్లడించారు. కాగా, యూపీ సీఎం పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.