శభాష్ జల్లి కీర్తి: ఐఏఎస్ కు ప్రశంస
అస్సాం వరద మురికిలో అడుగులు వేసిన ఐఏఎస్
ఇలా అన్నీ నాశనమైపోయాయి. ఈ నేపథ్యంలో అసోంలోని కచార్ వరద బాధిత ప్రాంతాల్లో కీర్తి జల్లి విస్తృతంగా పర్యటించారు. మోకాళ్ల లోతులో వున్న బురదలోకి కూడా ఆమె దిగారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దగ్గరి నుంచి తెలుసుకున్నారు. వాటికి పరిష్కారాలను చూపుతున్నారు.
ఆమెకు వృత్తిపై వున్న నిబద్ధత, ప్రజల పట్ల వున్న మమకారానికి అందరూ ఫిదా అయ్యారు. తోటి ఐఏఎస్లు కూడా ఫిదా అయిపోయారు. ఆమెకు సంబంధించిన ఫొటోలను అవనీశ్ శరణ్ అన్న ఐఏఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వరద ప్రాంతాల్లో ఓ బోటులో ప్రయాణిస్తూ… ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు.
కీర్తి జల్లి… అసోం ప్రభుత్వంలో తలలో నాలుక. అత్యంత సమర్థవంతంగా పనిచేస్తారని అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. రిమోట్ ప్రాంతాల్లో కూడా అద్భుతమైన సేవలందిస్తున్నారని ప్రభుత్వం కూడా ప్రశంసించింది. ప్రస్తుతం కీర్తి జల్లి అసోంలోని కచార్ డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.