మన బంగారం-నిఖిత్ జరిన్
కేసీఆర్,కవిత అభినందనలు
Updated: May 19, 2022, 23:49 IST
| ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడావేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను కేసిఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయమని కేసీఆర్ అన్నారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని, తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సీఎం కేసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.