home page

మోదీ పై కేసిఆర్ నిప్పుల వర్షం!

మోదీ జనానికి జవాబు చెప్పు 

 | 
Kcr
*మోడీపై నిప్పుల వర్షం కురిపించిన కేసీఆర్ !* 
దమ్ముంటే ఎకనాథ్ షిండేను తమిళనాడులో తీసుకురండి
దమ్ముంటే ఎకనాథ్ షిండేను తెలంగాణాలో తీసుకునిరండి
తెలంగాణ సమాజం ఏం చేస్తుందో చూద్దురుగాని
మేకిన్ ఇండియా ఎక్కడ? మన జెండాలు చైనా నుంచి..దీపావళి టపాసులు చైనా నుంచి, గణపతి విగ్రహాలు చైనా నుంచి.. గాలిపటాలు ఎగరేసే దారం చైనా నుండి...మేకిన్ ఇండియా అట్టర్ ప్లాప్ 
మోడీ కొన్నాళ్ళు కొనసాగితే దేశం ఒక శతాబ్దకాలం వెనక్కు వెళ్ళిపోతుంది...
సుజనాచౌదరి, ముకుల్ రాయ్, సీఎం రమేష్, హేమంత్ బిస్వాస్, నారాయణ్ రాణే..అందరిమీద సిబిఐ, ఈడీ వరుసబెట్టి దాడులు చేశాయి. వారంతా బీజేపీలో చేరగానే అంతా వాషింగ్ పౌడర్ నిర్మా!  
డెబ్బై అయిదు సంవత్సరాల భారత దేశ చరిత్రలో మోడీ వంటి అసమర్ధ ప్రధాని లేడు. మోడీ లాగ ఏ మూర్ఖుడూ పనిచెయ్యడు..
అద్భుతమైన ప్రగతికి దోహదకారులు కావలసిన యువతను మతపిచ్చివాళ్ళుగా తయారు చేస్తున్నారు.   
మోడీ శాశ్వతం కాదు. ఇది ప్రజాస్వామ్యం. 
ఇన్ని నీళ్లున్నా నీటియుద్ధాలు ఎందుకొస్తున్నాయి?
బ్యాంకులకు టోపీలు వేసినవాళ్లు విదేశాలు పారిపోయారు.
ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే నాకు లేదు. ఎందుకు భయపడాలి? 
నల్లధనం తెస్తామన్నారు. ఎనిమిదేళ్లలో స్విస్ బ్యాంకుల్లో మనవాళ్ళ నల్లధనం మూడింతలు ఎక్కువైంది.  
అవసరమైతే టీఆరెస్ జాతీయ పార్టీగా మారుతుంది.
బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే. తోడుదొంగల్లాంటివి. 
మనదేశానికి చైనా అధ్యక్షుల్లాంటి నాయకులు కావాలి.
సింగపూర్ జాతిపిత లాంటి నాయకులు కావాలి.
అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలి.  
***
ఒకటి కాదు..రెండు కాదు..తెలంగాణ బయట భయంకరమైన వర్షాలు..తుఫాన్...
హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కాంప్ కార్యాలయం ప్రగతి భవన్ లో చండ్రనిప్పుల వర్షం..కాదు కాదు...అగ్నికణాల సునామీ..
అబ్బో...కేసీఆర్ విశ్వరూపం అంటే ఏమిటో తెలియనివారికి ఈరోజు త్రివిక్రమావతారం గోచరమైంది.  
కేసీఆర్ చెలరేగిపోయారు. సహజంగా ఆయన తన మాటలతో జనాన్ని మెస్మరైజ్ చేస్తారు. కానీ ఈరోజు ఆలోచనలో పడేశారు. అంకెలతో సహా తన ఆరోపణలను బయటపెట్టారు. మోడీకి సూటిగా ప్రశ్నలు సంధించారు. ఎనిమిదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి ఏమిటో చెప్పమని నిలదీశారు.  
కేసీఆర్ ప్రసంగం, విలేకరుల ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల్లో ఎక్కడా తడబాటు లేదు. ఆసాంతం ఆత్మవిశ్వాసం కనిపించింది.  
పాత్రికేయుల ప్రశ్నలు అంటే ఆమడదూరం పారిపోయే నరేంద్ర మోడీ లాంటి ప్రధానికి ప్రెస్ మీట్లలో చెడుగుడు ఆదుకునే కేసీఆర్ లాంటి దార్శనిక దక్షత కలిగిన నాయకుడి ప్రశ్నలు అసలు అర్ధమే కాకపోవచ్చు. కేసీఆర్ ప్రశ్నలను అర్ధం చేసుకోవాలంటే ఒక ఔన్స్ అయినా బుర్రలో గుజ్జు ఉండాలి. మాటలతో జనాన్ని మభ్యపెట్టే మోడీ లాంటి వారికి కేసీఆర్ వెయ్యి జన్మలు ఎత్తినా అర్ధం కారు. 
తెలుగు, ఆంగ్ల, హిందీ భాషల్లో అనర్గళంగా సాగిన కేసీఆర్ స్పీచ్ తాలూకు ప్రకంపనలు ఢిల్లీ తీరం తాకుతాయనడంలో సందేహం లేదు.
ఈ సమావేశం చూసినవారు గ్రహించేది, విశ్వసించేది ఒక్కటే...దేశంలోని ముఖ్యమంత్రులతో ఒకే ఒక్క మగాడు, మొనగాడు, సాహసవంతుడు, పౌరుషవంతుడు, తన రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడగలిగినవాడు 
ఒక్కడే! అతడే కేసీఆర్!