home page

కెసిఆర్ -ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్

మనోహర్ పుస్తకం త్వరలో విడుదల 

 | 
Kcr the art of politics
"కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం ప్రిరిలీజ్-ఆర్డర్!
***
అతిత్వరలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరుగబోతోంది. ఎవరు ఆవిష్కరిస్తారు, ఎప్పుడు అన్నది బహుశా కొన్ని గంటల్లోనే నేను మీతో షేర్ చేసుకుంటానని అనుకొంటున్నాను. 
కట్ చేస్తే - 
ఆవిష్కరణ తేదీ రాగానే - ఈ పుస్తకం ప్రతులు ఎక్కడెక్కడ దొరుకుతాయన్న సమాచారం కూడా అందిస్తాము. 
హైద్రాబాద్‌లో ఉన్నవారైతే - వెంటనే ఎక్కడో ఒక ప్లేస్‌లో నేరుగా వెళ్ళి కొనుక్కోవచ్చు. హైద్రాబాద్ బయటున్నవారు మాత్రం ఆర్డర్ పెట్టి, తర్వాత కొరియర్-లేదా-పోస్ట్ ద్వారా వచ్చే పుస్తకం కోసం ఎదురుచూడకతప్పదు.   
హైద్రాబాద్‌లో ఉన్నవారిలో కూడా - ఆసక్తిఉన్నవాళ్ళు, పర్సనల్‌గా వెళ్ళి తెచ్చుకొనే సమయం లేనివాళ్ళు కూడా ప్రి-రిలీజ్ ఆర్డర్ చేసుకోవచ్చు. పుస్తకం ఆవిష్కరణ అయిన వెంటనే, ఎలాంటి ఆలస్యం లేకుండా - కొన్ని గంటల్లోనే అందరికీ కొరియర్-లేదా-పోస్ట్ ద్వారా పుస్తకాల్ని పంపిస్తాము. 
మిత్రులకు, తోటి కేసీఆర్ ఫ్యాన్స్‌కు, కేటీఆర్ ఫ్యాన్స్‌కు, తెలంగాణ ప్రేమికులకు ఒక గిఫ్ట్‌గా ఈ పుస్తకం ఇవ్వాలనుకొనే కేసీఆర్ ఫ్యాన్స్, కేటీఆర్ ఫ్యాన్స్, టీఆరెస్ కార్యకర్తలు, వివిధస్థాయిల్లోని లీడర్స్, రాజకీయవేత్తలు 100, 50, 25, 20, 10 పుస్తకాల చొప్పున బల్క్‌గా ఆర్డర్ ఇవ్వొచ్చు.     
తెలంగాణ ప్రియులు, కేసీఆర్ అభిమానులు, కేటీఆర్ అభిమానులు... మీమీ క్యాడర్స్‌లో మీకిష్టమైనవారికి ఈ పుస్తకం గిఫ్టుగా ఇవ్వటం అనేది నిజంగా మీకొక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. 
అవసరమైనవారికి ఈ పుస్తకం గిఫ్టుగా అందిచడం ద్వారా... ప్రత్యక్షంగా వారిని, వారి ద్వారా పరోక్షంగా ఇంకెందరినో మీరు ఇన్‌స్పయిర్ చేసినవాళ్ళవుతారు.   
జాతీయరాజకీయాల్లో కేసీఆర్ సంచలనాలు సృష్టించబోతున్న ఈ సందర్భంలో - మీమీ క్యాడర్స్‌లో అవసరమైనవారికి-లేదా-ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం బహుమతిగా ఇవ్వడం అనేది ఒకవైపు వ్యక్తిగతంగా మీకెంతో సంతృప్తినిస్తుంది. రెండోవైపు, కేసీఆర్ కోసం, తెలంగాణ కోసం మీ తరపున వందలాదిమందిని ఇన్‌స్పయిర్ చేసినట్టవుతుంది.  
ఇక - ఏ స్థాయిలోనైనా సరే - ప్రత్యక్షరాజకీయాల్లో ఉన్నవారికైతే - ఇలాంటి ప్రతిచిన్న అవకాశం కూడా ఏదోరకంగా ఉపయోగపడుతుంది. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. 
కట్ చేస్తే - 
216 పేజీల ఈ హార్డ్‌బౌండ్ క్లాసిక్ పుస్తకం ప్రి-రిలీజ్ ఆర్డర్స్, బల్క్ ఆర్డర్స్, పుస్తకం ధర గురించిన పూర్తివివరాలతో త్వరలోనే ఇంకో పోస్టుద్వారా మీముందుకొస్తాను. 
అప్పటిదాకా - మీకోసం, ఈ టీజర్:
https://youtu.be/IAJiDFgZgd8         
***
Read this on my blog:
https://nagnachitram.blogspot.com/2022/06/blog-post_29.html