home page

ఏపీ నీటి ప్రాజెక్టును ఆపండి

కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ  

 | 
projects in AP


కృష్ణానది యాజమాన్య బోర్డుకు
తెలంగాణ ఇఎన్‌సి లేఖ

 ఆంధ్రప్రదేశ్‌లో ఏవిధమైన అనుమతులు లేకుండాకృష్ణాబేసిన్ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణనదీయాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. బుధవారం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్ ఎంపి సింగ్‌కు లేఖ రాశారు.ఏపి ప్ర భుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని లేఖ ద్వారా బోర్డు దృష్టికి తీసుపోయా రు. ఏపిలో అక్కడి ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలిపివేయించాలని కోరుతూ ఇప్పటివరకూ తాము బోర్డు కు 40కిపైగా లేఖలు రాసినట్టు ఈఎన్సీ తెలిపారు. తాము చేసిన ఫిర్యాదులపైన ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఏపి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఏవిధమై న అనుమతులు పొందకుండానే అక్రమం గా నిర్మిస్తున్నట్టు తెలిపారు.ఇకనైనా బోర్డు స్పందించాలని కోరారు. ఏపిలో జరుగుతు న్న ఆయా ప్రాజెక్టుల పనులు వెంటనే నిలి పి వేయించాలని లేఖ ద్వారా విజ్ణప్తి చేశారు.

అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తుంన్నం దు వల్ల వాటి ప్రభావం కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ,నాగార్జున సాగర్ ప్రాజెక్టులపై పడుతుందని తెలిపారు. తాము ఇదే అంశాలను 15వ బోర్డు మీటింగ్‌లో కూడా వివరించినట్టు తెలిపారు. ఏపిలో చేపట్టిన అ క్రమ ప్రాజెక్టుల పనులు నిలిపివేయించాని కోరుతూ కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకుపోయినట్టు తెలిపారు. కృష్ణానదీజలాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి ఇప్పటికే అన్యాయం జరిగిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ చేసిన నీటిపంపిణీలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని కోరుతూ రెండవ ట్రిబ్యునల్ ను కూడా కోరినట్టు తెలిపారు. ఏపి ప్ర భుత్వం అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు నిర్మించడం ,ఇప్పటికే వున్న ప్రాజెక్టులను మరింత అధికసామర్ధంతో విస్తరించేపనులు కూడా చేపట్టిందని తెలిపారు.

ఏపిలో జరుగుతున్న ఈ పనుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులపైనే కాకుండా, అన్‌గోయింగ్ ప్రాజెక్టులపై కూడా వాటి ప్రభావం పడుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టాలను కూడా ఏపి ఉల్లంఘిస్తోందన్నారు. అపెక్స్ కౌన్సిల్ ఒప్పందాలను పాటించటం లేదన్నారు. వీటిపై వెంటనేతగు చర్యలు తీసుకోవాని కోరారు. గతంలో గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సులజ స్రంవంతి పథకాల విస్తరణ పనులు ,ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు , ఎస్‌ఆర్‌ఎంసి విస్తరణ పనులు , తెలుగు గంగ పధకం ప్రధాన కాలువ వెంట మిని ఎత్తిపోతల పథకాలు ,కుందూ నది విస్తరణ పనులను వివిరిస్తూ లేఖల ద్వారా ఇదివరకే బోర్డు దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిపారు. ఇప్పటికైనా బోర్డు స్పందించి ఏపిలో అక్రమంగా జరుగుతున్న ప్రాజెక్టుల పనులు నిలిపివేయించాలని కోరూతూ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.