home page

బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై పబ్లిక్ నోటీసు

 | 
Kcr

బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై బహిరంగ ప్రకటన.. కేసీఆర్ పేరుతో పబ్లిక్ నోటీసు

బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై బహిరంగ ప్రకటన:  పబ్లిక్ నోటీసు

ఇక జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ తన పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన సంగతి తెలిసిందే. దసరా రోజున ఈసీకి లేఖ కూడా అందజేశారు. ఎన్నికల సంఘం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

అందుకు ఇతర కారణాలు కూడా ఉన్నాయని తెలిసింది. తమ పార్టీ మార్పుకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ సోమవారం బహిరంగ ప్రకటన జారీచేసింది. అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాల్సిందే..గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పేరు మార్చుకునే సందర్భంలో వ్యక్తమయ్యే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ఉన్నాయి. ఆయా పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో స్థానిక పత్రికలు, ఇంగ్లీష్ పేపర్లలో కూడా ప్రకటన ప్రచురించాల్సి ఉంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై ప్రకటన విడుదల చేసింది.జనం లేదంటే రాజకీయ వర్గాల నుంచి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. అభ్యంతరాలు పంపిన తర్వాత వాటిని ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. పరిశీలన చేపట్టిన తర్వాత పార్టీ పేరు మార్పుకు సంబంధించి అధికారికంగా ఈసీ నుంచి ప్రకటన వస్తుంది. సెక్రటరీ (పొలిటికల్ పార్టీ), ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోకా రోడ్, న్యూఢిల్లీ అడ్రస్‌కు కారణాలతో సహా అభ్యంతరాలను పంపాలని పబ్లిక్ నోటీసులో పేర్కొన్నారు.

నెల తర్వాత అనుమతి: బీఆర్ఎస్ పేరు మార్పుకి సంబంధించి నెల రోజుల తర్వాత అనుమతి వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌కు అనుమతి వస్తే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ బృందాన్ని గుజరాత్‌కి పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పేరుతో చాలా పార్టీలు ఉన్నాయట.. అందుకే ఈసీ అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తోందని తెలిసింది. అలా అయితే కేసీఆర్ మరో పేరు చూసుకోవాలా..? అనే సందేహాం వస్తోంది. కానీ దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానందున.. ఏం జరుగుతుందో చూడాలీ మరీ