విభజన సమస్యలు గాలికి
తెలంగాణకు బిజెపి రిక్తహస్తం
ఐటి రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలన్న బీజేపీ, ప్రభుత్వ కుట్రలకు ఐటీఐఆర్ రద్దు పరాకాష్ట కాదా? పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు.
కానీ అధికారంలోకి వచ్చి ఇన్నేండ్లు గడిచినా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదు? 2014లో హైదరాబాద్ కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును ఉపసంహరించుకున్నారు.
బీజేపీ ప్రభుత్వ విధానాలు దేశానికి ప్రమాదకరంగా తయారయ్యాయి. కేంద్ర సర్కార్
అసమర్థపాలన వల్ల దేశం ఆర్థికంగా కుంగిపోతున్నది . బీజేపీ పాలనలో దేశం ఏ రంగంలోనూ అభివృద్ధి సాధించింది లేదు. దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. దాన్ని సాగు,తాగునీటిగా వినియోగించుకోకపోవడం వల్ల వృథాగా సముద్రం పాలవుతున్నది. నిత్యం అబద్ధాలు, అవాస్తవాలతో సాగిస్తున్న పాలన దేశ సమగ్రతను కాపాడలేదు. విద్వేషాలు సృష్టించే శక్తులు దేశానికి క్షేమకరం కాదు. ప్రతిష్టాత్మక సంస్థ ఎల్‌ఐసీని, రైల్వేలను, ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించడం తప్ప దేశ ప్రజల సంక్షేమం కోసం చేసిందేమిలేదు. పైగా విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నది.
ఐటీ రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలన్న బీజేపీ, ప్రభుత్వ కుట్రలకు ఐటీఐఆర్ రద్దు పరాకాష్ట కాదా? పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఇన్నేండ్లు గడిచినా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదు? 2014లో హైదరాబాద్ కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును ఉపసంహరించుకున్నారు.
తెలంగాణకు మోదీ చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోరు. కేంద్ర క్యాబినెట్ తొలి భేటీలోనే తెలంగాణకు అన్యాయం చేస్తూ పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో కలిపిన సందర్భాన్ని ఎవరూ ఉపేక్షించరు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి విభజన హామీలపై తె లంగాణ ప్రజలకు ప్రధాని సమాధానం చెప్పాల్సిందే. తెలంగాణపై కేంద్రం ప్రతీ అంశంలోనూ వివక్ష చూపుతూనే ఉన్నది. అప్పటికే మంజూరైన అనేక ప్రాజెక్టులను రద్దు చేసి తీరని అన్యాయం చేసింది.
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో అప్పటి పది జిల్లాల సరిహద్దులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఆ చట్టానికి తూట్లు పొడిచి, ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఈ విషయంలో కనీసం తెలంగాణ రాష్ర్టానికి సమాచారం కూడా ఇవ్వలేదు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా?
2. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసే విషయంలో, వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ విషయంలో, వరంగల్ టెక్స్ టైల్స్ పార్కుకు కేంద్రం సాయం అందించే విషయంలో, మంజూరైన అన్ని జాతీయ రహదారులకు నిధులు విడుదల చేసే విషయంలో, నీటి పంపకాలు త్వరగా పూర్తయ్యే విషయంలోనూ కేంద్రం అన్యాయమే చేసింది.
3. ఐటీ రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలన్న బీజేపీ, ప్రభుత్వ కుట్రలకు ఐటీఐఆర్ రద్దు పరాకాష్ట కాదా? పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఇన్నేండ్లు గడిచినా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదు? 2014లో హైదరాబాద్ కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును ఉపసంహరించుకున్నారు. గుజరాత్‌కు గిఫ్ట్ సిటీ పేరుతో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇచ్చింది. ఢిల్లీ-ముంబాయి ఇండస్ట్రీయల్ కారిడార్ కు నిధులు ఇచ్చింది. మరి హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు రద్దు చేసినట్లు? ఇది కేంద్రం తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీయడం కాదా?
4. ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరించే విషయంలో, సీలేరు పవర్ ప్లాంటు నష్ట పరిహారం చెల్లించే విషయంలో, ఎస్సీ వర్గీకరణకు ఆమోద ముద్ర వేయించే విషయంలో, ఎస్టీ రిజర్వేషన్ అమలయ్యే విషయంలో, తెలంగాణకు రావాల్సిన నిధులు విడుదల చేయించే విషయంలో స్థానిక బీజేపీ నాయకులు కేంద్రంతో కొట్లాడి తెలంగాణ ప్రజల మన్ననలు పొందితే బాగుంటుంది.
5. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని ఏన్నో ఏండ్లుగా వరంగల్ జిల్లా ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. అక్కడ యూపీఏ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని మాటిచ్చింది. కేంద్రం కోరిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట సమీపంలో వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూమిని గుర్తించింది. కానీ అది అమలుకు నోచలేదు.
6. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ విషయంలో అన్యాయం జరిగిందని. కానీ తెలంగాణకు దక్కాల్సిన 575 టీఎంసీల సాగునీటి వాటాల కేటాయింపులపై తెలంగాణ కోరుతున్న విధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు రెఫర్ చేయకుండా 8 ఏండ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారో సమాధానం లేదు.
7. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. కనీసం ఒక్క ప్రాజెక్టుకయినా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఆర్థిక సహాయం చేయాలని ఎన్నో సార్లు అడిగినా ఒక్క దానికీ కూడా ఇవ్వలేదు.
8. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.
9. నీతి ఆయోగ్ కు స్వయంగా ప్రధాన మంత్రే అధ్యక్షుడు. తెలంగాణలో సాగునీటి వనరుల అభివృద్ధికి మిషన్ కాకతీయ, మంచినీటి వసతి కల్పనకు మిషన్ భగీరథ గొప్పగా అమలు చేస్తున్నారని నీతి ఆయోగ్ కితాబునిచ్చింది. ఇవి దేశానికే గర్వకారణమైన కార్యక్రమాలు కాబట్టి, మిషన్ భగీరథకు 19వేల కోట్లు, మిషన్ కాకతీయకు 5వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం సాయంగా అందించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది.కానీ ఆ నిధులు ఇచ్చింది లేదు.
10. తెలంగాణ రాష్ర్టానికి 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవానికి కేవలం 1,300 కిలోమీటర్లకు మాత్రమే నిధులు విడుదల చేసింది. ఇంకా 1,855 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నిధులు ఇవ్వలేదు. పరిపాలనా అనుమతులు ఇవ్వలేదు.
11. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే 2,016 రూపాయల ఫించన్‌లలో కేంద్రం వాటా కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే. కానీ1600 కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నదని అబద్ధాలు ఆడుతున్నారు.
12. నేషనల్ టెక్నికల్ టెక్స్ టైల్స్ మిషన్ పేరిట, స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్ టైల్స్ పేరిట కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా టెక్స్ టైల్ రంగాభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నది. ఎగుమతులు ఉత్పత్తి తయారీ యూనిట్లకు స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించింది. ఇది ఎక్కడ వరకు వచ్చింది , మరి దేశంలోనే అతి పెద్దదైన టెక్స్ టైల్ పార్కును వరంగల్ లో నిర్మిస్తున్న తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం ఎందుకు ఈ పథకాలను వర్తింపచేయడం లేదో సమాధానం చెప్పాలి.
13. రాష్ర్టాలకు రుణ పరిమితితోపాటు నిధులు కూడా ఇవ్వాలని 15 ఆర్థిక సంఘం పేర్కొన్నది. తెలంగాణకు 2020-21లో రూ.723 కోట్లు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని, పౌష్టికాహారం కోసం రూ.171 కోట్లు, 2021-26 మధ్య స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు, సెంటర్ స్పెసిఫిక్ గ్రాంట్లు కింద రూ.5,374 కోట్లు మొత్తంగా 6,268 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. కానీ ఆ నిధులేవి ఇచ్చింది లేదు. 14 వ ఆర్థిక సంఘం.. మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు, ఇతరవాటికి రూ.817 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. కానీ కేంద్రం తెలంగాణకు ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ర్టానికి చేసిన సహాయం ఏమిటో కేంద్రం సమాధానం చెప్పాలి? తెలంగాణపై అదే సవతి తల్లి ప్రేమను ఇలాగే కొనసాగిస్తే బీజేపీ.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
(వ్యాసకర్త: తెలంగాణ ఉద్యమకారుడు)
తీగల అశోక్ కుమార్
79891 14086