హైదరాబాద్ పచ్చలహారం !
వరల్డ్ గ్రీన్సిటీ అవార్డ్ !
: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు అంటే ఒక రహదారి మాత్రమే కాదు. పచ్చని అందాలతో కనువిందు చేసే చక్కని ప్రదేశం.
పచ్చల హారంలా ఓఆర్‌ఆర్‌ఇంటర్‌చేంజ్ రోటరీస్
ప్రత్యేక నిర్మాణాలు చేపట్టేందుకుప్రతిపాదనలు
19 రోటరీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు హెచ్‌ఎండీఏ కృషి
: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు అంటే ఒక రహదారి మాత్రమే కాదు. పచ్చని అందాలతో కనువిందు చేసే చక్కని ప్రదేశం. అలాంటి ఔటర్ రింగు రోడ్డు నిర్వహణను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆకర్షణలను జోడిస్తూ వాహనదారులనే కాదు యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నది. అందుకు నిదర్శనం ఇటీవలే దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ కార్యక్రమంలో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలను వెనక్కి నెట్టి పచ్చదనంలో నగరం ' వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు-2022' అవార్డును సొంతం చేసుకున్నది. తాజాగా ఓఆర్‌ఆర్ చుట్టూ 19 చోట్ల ఉన్న ఇంటర్ చేంజ్‌ల వద్ద ఉన్న రోటరీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఒక్కో ఇంటర్ చేంజ్ వద్ద రెండు వైపులా రోటరీలు(గుండ్రని ఆకారంలో) ఉన్నాయి. వీటి నిర్వహణను మరింత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించి, దానికి అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
పచ్చదనంతో పరవళ్లు..
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ పొడవునా ఓఆర్‌ఆర్‌పై 19 చోట్ల ఇంటర్‌చేంజ్‌లు ఉన్నాయి. కొత్తగా మరో మూడు చోట్ల నిర్మాణంలో ఉన్నాయి. ఇంటర్‌చేంజ్‌లు ఉన్న చోట 50 నుంచి 100 ఎకరాల వరకు భూములు హెచ్‌ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. ఈ భూముల్లోనూ మొక్కలు నాటారు. వీటికి తోడు కొన్ని ఇంటర్‌చేంజ్‌ల వద్ద నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటి వరకు సుమారు ఔటర్ రింగు రోడ్డు చుట్టూ 7 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఇప్పుడవన్నీ పూర్తి స్థాయిలో ఎదిగి పచ్చదనంతో నిండు అడవిని తలపిస్తున్నది.
'వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు' ప్రదర్శన..సెల్ఫీలతో నగర వాసుల సందడి: హైదరాబాద్ మహానగరానికి దక్కిన వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ -2022 ట్రోఫీని నగరంలో పలు చోట్ల ప్రదర్శనకు ఉంచారు. ఇటీవల దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ కార్యక్రమంలో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలను వెనక్కి నెట్టి పచ్చదనంలో నగరం అవార్డును సొంతం చేసుకున్నది. ఈ అవార్డును నగరంలోని 10 చోట్ల ప్రదర్శనకు ఉంచారు. ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్సీల వద్ద నగర వాసులు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.