home page

ముక్తి ఘాట్ ప్రారంభం

 | 
Mukthi ghat
  • ఫతుల్లాగూడలో రూ.16.25 కోట్లతో
  • ఆరున్నర ఎకరాల్లో నిర్మాణం
  • నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

 మతాల ప్రజల అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆధునిక హంగులతో ప్రభుత్వం వైకుంఠధామాన్ని నిర్మించింది. గ్రేటర్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ నియోజకవర్గం ఫతుల్లాగూడలో సుమారు 6.5 ఎకరాల స్థలంలో ముక్తిఘాట్‌ పేరిట రూ.16.25 కోట్లతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ శ్మశాన వాటికను అభివృద్ధి చేశారు. 2 ఎకరాలు ముస్లిం, మరో 2 ఎకరాలు క్రిస్టియన్‌, హిందూ శ్మశాన వాటికకు 2 1/2 ఎకరాలు కేటాయించారు. ప్రార్థన మందిరాలు, ప్రత్యేక స్నాన గదులు, అడుగడుగునా గ్రీనరీ, అపర కర్మలను (10వ రోజు) చేసేందుకు ప్రత్యేక గది, 140 కిలోవాట్ల గల సామర్థ్యం గల సోలార్‌ విద్యుత్‌ సరఫరా, ప్రత్యేకంగా సివరేజ్‌ ప్లాంట్‌ ఇతర దేశాల్లో ఉన్న వారు తమ తమ బంధువుల దహన సంసారాలను తిలకించేందుకు సాంకేతిక టెక్నాలజీనీ కూడా ఏర్పాటు చేశారు.

సీఎం కేసీఆర్‌ ఆలోచన… ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి
హైదరాబాద్‌ పరిధిలో ప్రతిరోజు 2500 మందికి పైగా మరణాలు సంభవిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. ఇందులో దాదాపు 300 నుంచి 400 మంది వరకు ముస్లింలు, క్రిస్టియన్లు, 2100 మంది హిందువులు చనిపోతున్నారు. వీరి దహన సంసారాలకు రోజుకు 2100 టన్నుల కట్టెలు అవసరం. ఈ కట్టెలు ఎకడి నుంచి తేవాలి…..? ఏదో ఒక చెట్టును నరికితే గాని ఈ కట్టెలు లభించవు. హైదరాబాద్‌ పరిధిలోనే ఇంత కర్ర అవసరం ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత కర్ర కావాలి ? ఎన్ని చెట్లు నరికి వేయాలి ? ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారంలో వార్డు సభ్యుడు నుంచి రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను చైతన్యం చేసి కోట్లాది మొకలు నాటుతుంటే, పెరిగిన చెట్లను సంప్రదాయాల పేర నరికివేసి కాలుష్యానికి కారణమవుతున్నాము.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న హరితహారం స్ఫూర్తి నెరవేరాలంటే కట్టెలులేని దహన సంసారాలు జరగాలి. ఆ కోణంలో నుంచి వచ్చిన ఆలోచనతో ఫతుల్లాగూడలో ఆధునిక హంగులతో శ్మశానవాటిక ఏర్పాటు చేశాం. కట్టెలు అవసరం లేని అంత్యక్రియలు నిర్వహించే శ్మశానవాటిక దేశంలోనే ఇది మొదటిది. బతికినన్ని రోజులు కులాలు, మతాలుగా విభజింపబడి విభేదాలు సృష్టించుకుంటున్నారు. సమాజంలో రోజురోజుకు కులతత్వం పెరిగిపోతుంది. 30 ఏండ్ల క్రితం చదువుకున్న వారు తకువ ఉన్నా.. కులతత్వం తకువగా ఉండేది. ప్రస్తుతం విద్యాపరంగా అభివృద్ధి సాధించినా కులాల ఫీలింగ్‌ ఎకువైంది. ఏ మతస్తుడు, ఏ కులస్తుడు మరణించినా అంతిమంగా శ్మశానానికి వెళ్లాల్సిందే. మరణం అనంతరమైనా కులాల గోడలు, మతాల గోడలు లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల శ్మశాన వాటికలు నిర్మించడం ఫతుల్లాగూడ ప్రత్యేకత.

ప్రత్యేకతలు

  • ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాల ప్రకారం ముక్తిఘాట్‌లో 20 శాతం మాత్రమే నిర్మాణాలున్నాయి.
  • పూర్తిగా సౌర విద్యుత్‌ వినియోగం, ప్రత్యేకంగా సోలార్‌ ప్లాంట్‌, ఘాట్‌ చుట్టూ 40 అడుగుల చెట్లు కనువిందు చేయనున్నాయి.
  • స్నానపు, విశ్రాంతి గదుల్లో నీటిని పునర్వినియోగించుకునేలా 0.2 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు.
  • సేద తీరేలా ఉద్యానం, చూడగానే ఆకట్టుకునేలా ల్యాండ్‌ స్కేపింగ్‌, అలంకరణ, పూల మొక్కలు ఏర్పాటు చేసి పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు.
  • ఈ ముక్తిఘాట్‌ను వెళ్లేందుకు వీలుగా 40 ఫీట్ల బీటీ రోడ్‌ ఏర్పాటు చేశారు.
  • ఈ శ్మశాన వాటికలో బ్యాండ్‌, డప్పులు, వాయిద్యాలు తదితర శబ్ద కాలుష్యం నిషేధం.