home page

మోడీ చేతికి ఆదాని 'బొగ్గు' మరకలు!

ఆది నుంచే స్నేహితుడు కోసం మోడీ ఆరాటం 

 | 
modi posters banners

నిబంధనలు కాదన్నా, నీతి అయోగ్ వద్దన్నా ఆదాని కే వడ్డన!

*అదానీకి యథేచ్ఛగా నల్ల బంగారం గనులు.*
కేంద్రంలోని బీజేపీ సర్కారు అండతో పోర్టులు, ఎయిర్‌పోర్టులు,రైల్వే, సిమెంటు,బొగ్గు, విద్యుత్తు,రవాణా,గ్యాస్‌, రిటైల్‌,మీడియా ఇలా ముప్పైకిపైగా కీలక రంగాల్లో అదానీ గ్రూప్‌ పాతుకుపోయింది.
కోల్‌ మైనింగ్‌లో అదానీ గ్రూప్‌నకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారన్న ఆరోపణలున్నాయి.ఆ కాంట్రాక్టులను రద్దు చేయండి' అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదు. టెండర్లను రద్దు చేయలేదు.మిత్రుడికి ఆర్థిక లబ్ధిచేకూర్చేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లిమరీ డీల్‌ సెట్‌ చేశారు.రూ.1.6 లక్షల కోట్ల ప్రాజెక్టు కట్టబెట్టేందుకు ఆదివాసీల జీవవైవిధ్యాన్ని సైతం పణంగా పెట్టారు.      
గౌతమ్‌ అదానీ 'కోల్‌ కింగ్‌’గా మారడంలో ప్రధాని మోదీ పోషించిన పాత్ర ఇది.
 కేంద్రంలోని బీజేపీ సర్కారు అండతో పోర్టులు,ఎయిర్‌పోర్టులు, రైల్వే,సిమెంటు,బొగ్గు, విద్యుత్తు,రవాణా,గ్యాస్‌, రిటైల్‌,మీడియా ఇలా ముప్పైకిపైగా కీలక రంగాల్లో అదానీ గ్రూప్‌ పాతుకుపోయింది.        
కోల్‌ మైనింగ్‌లో అదానీ గ్రూప్‌నకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కోర్టు తీర్పులను ఆయన పక్కనబెట్టారు.దౌత్య సంబంధాలను తాకట్టు పెట్టారు.ఆదివాసీల హక్కులను కాలరాశారన్న వాదనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
హస్‌దేవ్‌లో అదానీ విధ్వంసం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లోని మూడు జిల్లాలు సర్గుజా, సుజాపూర్‌,కొర్బల్లో 1,800 చదరపు కిలోమీటర్ల మేర హస్‌దేవ్‌ అరండో అభయారణ్యం విస్తరించి ఉన్నది. వందలాది ఆదివాసీ జాతులు ఇక్కడ శతాబ్దాల తరబడి నివసిస్తున్నాయి. ఈ అటవీ భూముల్లో వేల టన్నుల బాక్సైట్‌, మాంగనీసు,సున్నపురాయి నిల్వలున్నాయి. అంతేగాకుండా ఈ భూముల్లో 500 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు అంచనా ఈ నిల్వలు భూ ఉపరితలానికి కొంత లోతులోనే ఉన్నాయి. దీంతో అదానీ గ్రూప్‌ ఇక్కడి బొగ్గు గనులనూ చౌకగా చేజిక్కించు కోవాలను కొన్నది. 
2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇక్కడి బొగ్గు నిక్షేపాలను 23 బ్లాకులుగా విభజించి పర్సా ఈస్ట్‌ కంటె బాసన్‌ (పీఈకేబీ) పేరిట ఆరు బ్లాకులకు టెండర్లను పిలిచింది.అప్పుడు దేశంలో విద్యుత్తు సంక్షోభం నెలకొన్న కారణంగా టెండర్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యుత్తు కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది.ఈ డీల్‌ను రాజస్థాన్‌కు చెందిన రాజ్య విద్యుత్‌ ఉత్పాదన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీయూఎన్‌ఎల్‌) చేజిక్కించుకొన్నది. అయితే,ఆ సమయంలో రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.
గుజరాత్‌లో మోదీ సీఎంగా ఉన్నారు. పీఈకేబీ బ్లాక్‌ బొగ్గు గనుల కోసం అదానీ గ్రూప్‌ అప్పటి గుజరాత్‌ సీఎంతో రాయబారం నడిపినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటికి బలాన్ని చేకూరుస్తూ.. ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్‌.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కి రాత్రికి రాత్రి బొగ్గు తవ్వకాలకు అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కాంట్రాక్ట్‌ కట్టబెట్టింది. 
మరుసటి ఏడాది పర్సా కంటె క్యాలరీస్‌ లిమిటెడ్‌ (పీకేసీఎల్‌) పేరిట ఆర్‌వీయూఎన్‌ఎల్‌తో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌.. ఆ వెంచర్‌లో 74 శాతం వాటాను చేజిక్కించు కొన్నది. 2014లో కాంట్రాక్టును మొత్తం హస్తగతం చేసుకోవడానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రయత్నించింది.బొగ్గు గనులు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఉండటం.. 
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కలిసొచ్చింది.అలా.. పీఈకేబీలోని నాలుగు బ్లాకులు (మార్కెట్‌ విలువ రూ.1.6 లక్షల కోట్లు) అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు దక్కాయి.
ఆదివాసీల ఆందోళనలు
హస్‌దేవ్‌ అరండోలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగించిన బొగ్గు గనుల లీజును రద్దు చేయాలని కోరుతూ ఇక్కడి వందలాది ఆదివాసీలు, గ్రామస్థులు 2013 నుంచి ఆందోళనలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న మైనింగ్‌ కారణంగా సమీపంలోని నదీజలాలు విషపూరిత మయ్యాయని,తాము ఆవాసం కోల్పోయామని, లక్షలాది వృక్ష జాతులు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'హస్‌దేవ్‌ అరణ్య బచావో సంఘర్ష్‌ సమితి (హెచ్‌ఏబీఎస్‌ఎస్‌)' ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తూ,వందల కిలోమీటర్లలో పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు.మైనింగ్‌ కార్యకలాపాలను రద్దు చేయాలంటూ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రానికి గత అక్టోబర్‌లో లేఖ రాసింది.అయిన ప్పటికీ,కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.
గొడ్డా కహానీ..
2015 జూన్‌లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లారు. దౌత్య,వాణిజ్య సంబంధాల బలోపేతంలో భాగంగా ఆ దేశంతో 4.5 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చు కున్నారు. పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనాకు హామీనిచ్చారు. అయితే,జార్ఖండ్‌లోని గొడ్డాలో నిర్మించనున్న అదానీ పవర్‌ ప్లాంట్‌ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాలని, అదానీకి చెందిన విద్యుదుత్పత్తి, ట్రాన్స్‌మిషన్‌,డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలను బంగ్లాలో స్థాపించేందుకు అనుమతి నివ్వాలని మెలిక పెట్టారు. 
దీంతో 40 శాతం అదనంగా విద్యుదుత్పత్తి చేసే సామర్థ్యమున్నా 25 ఏండ్ల డీల్‌కు హసీనా ఒప్పుకొన్నారు.
సుప్రీం వద్దన్నా ముందుకే.....
1993-2011 మధ్య జరిగిన 218 బొగ్గు గనుల లీజు ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కాగ్‌ ఇచ్చిన రిపోర్టును ఆధారంగా చేసుకొని 2014లో ఆయా ఒప్పందాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అనంతరం.. అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు ఒప్పందాలు రైద్దెన బొగ్గు గనులకు మళ్లీ పారదర్శకంగా వేలం ప్రక్రియ నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే, సుప్రీంకోర్టు రద్దు చేసిన బొగ్గు గనుల లీజుల్లో అదానీ కంపెనీలకు చెందిన ఐదు కాంట్రాక్టులు కూడా ఉన్నాయి.ఇందులో మూడు కాంట్రాక్టులు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ కంపెనీలతోనే అదానీ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకున్నది.దీంతో అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో కోల్‌ మైన్స్‌ స్పెషల్‌ ప్రొవిజన్స్‌ యాక్ట్‌ పేరిట మైన్‌ డెవలపర్‌ అండ్‌ ఆపరేటర్‌ (ఎండీవో) కాంట్రాక్టు పాలసీలో ప్రత్యేక నిబంధనలను కేంద్రం చేర్చింది.         
2014 కంటే ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు కంపెనీలతో కుదుర్చుకొన్న ఎండీవో బొగ్గు గనుల లీజులను అలాగే కొనసాగించ వచ్చని, కొత్తగా టెండర్లు పిలువాల్సిన పనిలేదని అందులో పేర్కొంది.దీంతో సుప్రీంకోర్టు రద్దుచేసిన కాంట్రాక్టులను అదానీ కంపెనీలు కొనసాగించ డానికి మార్గం సుగమమైంది.కొత్తగా మరో నాలుగు కాంట్రాక్టులను కూడా అదానీ కంపెనీకి కేంద్రం కట్టబెట్టింది.
నీతి ఆయోగ్‌ తప్పని చెప్పినా..ఎండీవో పాలసీలో ఉల్లంఘన లున్నాయని క్యాబినెట్‌ సెక్రటరీకి నీతి ఆయోగ్‌ 2020లో ఓ నివేదికను సమర్పించింది. దీనిపై చర్చించిన ప్రధాన మంత్రి కార్యాలయం ఎండీవో పాలసీ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి కాంట్రాక్టులను అనుమతించబోమని తెలిపింది.అయితే అప్పటికే,అదానీ గ్రూప్‌ కంపెనీలకు అప్పగించిన తొమ్మిది (గతంలో 5, ఆ తర్వాత 4) బొగ్గు గనుల లీజులను మాత్రం రద్దు చేయలేదు.                
ఇలాగే నీతి ఆయోగ్‌ ఇచ్చిన రిపోర్ట్‌నూ కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందన్న ఆరోపణలున్నాయి.
పవర్ ఆఫ్ ఆర్టీఐ ద్వారా లభించిన సమాచారం ఇది.