home page

ఎలక్టోరల్ బాండ్లపై 'సుప్రీం' నేడు విచారణ

భారీగా బాండ్లు జారీ చేసిన కేంద్రం  

 | 
bonds by govt

న్యూఢిల్లీ  జనరల్ బ్యూరో  : రాజకీయ పార్టీలకు అనామకంగా నిధులు సమకూర్చేందకు వీలు కల్పించే ఎలక్టోరల్‌ బాండ్ల జారీని అనుమతించే చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు నేడు (అక్టోబర్‌ 14) విచారించనుంది.

సుప్రీం కోర్టు న్యాయవాదులు ప్రశాంత్‌ భూషణ్‌, అశ్వీని ఉపాధ్యాయతో పాటు సిపిఎం, అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌), కామన్‌ కాజ్‌ అనే రెండు ఎన్‌జిఓలు ఐదు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఆర్థిక చట్టం-2017 ఆధారంగా ఎలక్టోరల్‌ బాండ్‌లు ప్రవేశపెట్టారు. ఎలక్టోరల్‌ బాండ్లను ప్రవేశపెట్టడానికి వీలుగా ఆర్‌బిఐ చట్టం, ఆదాయపు పన్ను చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం వంటి మూడు చట్టాలను సవరించారు.

అప్పటికి బిజెపి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజార్టీ లేదు. అందువల్లనే మనీబిల్లుగా తీసుకొచ్చారు. దీంతో రాజ్యసభ ఆమోదం అవసరం లేకపోయింది. కేవలం లోక్‌సభలో మాత్రమే ఆమోదించుకున్నారు.

ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన ఐదు చట్ట సవరణలను సవాల్‌ చేస్తూ రాజకీయ పార్టీలకు అపరిమిత, తనిఖీ లేని నిధులకు తలుపులు తెరిచాయని వివిధ వ్యక్తులు, సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. అందులో వంద శాతం పన్ను రాయితీ ఉందని పేర్కొన్నాయి. ఈ సవరణల వల్ల ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సిన రాజకీయ పార్టీల వార్షిక విరాళాల నివేదికలలో ఎలక్టోరల్‌ బాండ్లతో విరాళాలు ఇస్తున్న వారి పేర్లు, చిరునామాలను పేర్కొనాల్సిన అవసరం లేదని, తద్వారా రాజకీయ నిధులలో పారదర్శకత దెబ్బతింటుందని పేర్కొన్నాయి. దీంతో రాజకీయ అవినీతికి చట్టబద్ధత చేసినట్లు ఉందని విమర్శించాయి.