వందేభారత్ రైలుకు కాషాయ రంగు
చెన్నై కోచ్ ఫ్యాక్టరీలో తయారీ
Jul 9, 2023, 02:00 IST
| రికార్డు స్థాయిలో కొత్త రైలు బో్గీలా తయారీ
*కొత్త రంగులో వందేభారత్ ఎక్స్‌ప్రెస్*
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కొత్తరంగులో రాబోతుంది. మొన్నటివరకు ప్రారంభించిన వందేభారత్ రైళ్లు బ్లూ-గ్రే కాంబినేషన్‌లో ఉండగా.. తాజాగా ఆరెంజ్-గ్రే కాంబినేషన్‌లో కొత్త రైళ్లు రాబోతున్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)ని సందర్శించి కొత్తరంగులతో కూడిన ట్రైన్ ఫొటోలను రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. కాగా.. ఇక్కడా బీజేపీ రంగులేనా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.