home page

ఎమ్మెల్యేలు, ఎంపీల కేసులపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు

ఐదేళ్లు పైబడిన కేసుల వివరాలివ్వాలి

 | 
Supreme court

ఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం నుంచి పెండింగులో ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను 4 వారాల్లోగా తమకు సమర్పించాలని హైకోర్టులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

ఆయా కేసుల్లో విచారణ ప్రక్రియను వేగంగా ముగించేందుకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని సూచించింది. చట్టసభ్యులపై కేసుల్లో విచారణ జరుపుతున్న న్యాయాధికారులను తమ అనుమతి లేకుండా మార్చకూడదంటూ గతేడాది ఆగస్టు 10న జారీ చేసిన ఉత్తర్వును జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లి ధర్మాసనం సవరించింది. వారిని బదిలీ చేసే స్వేచ్ఛను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కల్పించింది.