home page

గుజరాత్ కు ఇరవై రెండు వేల కోట్లతో భారీ డిఫెన్స్ పరిశ్రమ

టాటా, ఎయిర్‌బస్  ఉమ్మడి ఒప్పందం  

 | 
Modi

మిలటరీ విమానాలు తయారు చేయడం

 ప్రైవేటు కంపెనీ  ఇదే మొదటిసారి  

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, షా సొంత రాష్ట్రం గుజరాత్‌‌ను  భారీ ప్రాజెక్ట్ వరించింది. టాటా , ఎయిర్‌బస్ లు ఉమ్మడిగా వడోదర నగరంలో  మిలిటరీ విమానాలను తయారు చేయనున్నాయి.

♦️ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.22,000 కోట్లు లేదా 2.66 బిలియన్ డాలర్లుగా ఉందని డిఫెన్స్ సెక్రటరీ డా. అజయ్ కుమార్ వెల్లడించారు.

 ఒక ప్రైవేటు కంపెనీ భారత్‌లో మిలిటరీ విమానాలు తయారుచేయడం ఇదే మొదటిసారని, ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.21,935 కోట్లని ఆయన చెప్పారు. సివిల్ విమానాల తయారీ కోసం దీనిని ఉపయోగించొచ్చునని వివరించారు. కాగా గుజరాత్‌ తదుపరి ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ ఒప్పందం ఖరారవ్వడం విశేషం.

వచ్చే ఆదివారం వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగాల సృష్టి జరగనుందనే అంచనాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే మిలిటరీ విమానాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కీలకమైన మిలిటరీ టెక్నాలజీ, పరికరాల విషయంలో విదేశాల సాయం కోరాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి ఈ ప్రాజెక్ట్ ఊతమివ్వనుందనే అంచనాలున్నాయి. కాగా ఎయిర్‌బస్ నుంచి 56 విమానాల కొనుగోలుకు గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా 16 విమానాలు తయారై సిద్ధంగా ఉన్నవి అందించాల్సి ఉండగా.. 40 విమానాలను భారత్‌లోనే తయారు చేయాల్సి ఉంటుందని డిఫెన్స్ సెక్రటరీ గురువారం వెల్లడించింది.