home page

గుజరాత్లో ఎన్నికల వేళ తెరపైకి కామన్ సివిల్ కోడ్ !

కొత్త వివాదం ,కొత్త నినాదం  

 | 
gujarat

ఇంకా వెల్లడి కాని ఎన్నికల నోటిఫికేషన్  

  • గుజరాత్లో  ఎన్నికల వేళ బిజెపి కొత్త నినాదం  

అహ్మదాబాద్‌ : ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ అజెండాలో ఒకటైన ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌) మళ్లీ తెరపైకి వచ్చింది.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి కామన్ సివిల్ కోడ్   పాచిక విసురుతోంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి)ని అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ శనివారం ప్రకటించారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ తర్వాత యుసిసి అమలుకు కమిటీ వేస్తామని ప్రకటించిన బిజెపి పాలిత రాష్ట్రాల్లో గుజరాత్‌ మూడవది. ఈ కమిటీ ఏర్పాటు ప్రతిపాదనకు శనివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందనిరాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి హర్స సంఘ్వీ చెప్పారు. అహ్మదాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 'ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అండదండలతో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. యుసిసి అమల్జేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది' అని పేర్కొన్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం వచ్చే వారం ప్రకటిస్తుందని భావిస్తున్నారు. అందువల్ల భూపేంద్ర పటేల్‌ నేతృత్వంలోని మంత్రివర్గ చివరి సమావేశం ఇదే కావచ్చు. కమిటీ ఏర్పాటు విషయాన్ని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా ధ్రువీకరించారు. రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ వుంటుందని, ముగ్గురు లేదానలుగురు సభ్యులు కమిటీలో వుంటారని రూపాలా చెప్పారు. ఇంతకుమందు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లోని బిజెపి ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని ప్రకటించాయి.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు హిమాచల్‌ ప్రదేశ్‌తో పాటే జరగాల్సి వుండేది. ఎన్నికల సంఘం మాత్రం హిమాచల్‌కే షెడ్యూలు విడుదల చేసి గుజరాత్‌లో ఎన్నికలను వాయిదా వేసింది. అప్పట్లోనే ఏదో కొత్త వివాదాన్ని రాజేసేందుకు బిజెపి సమయం తీసుకుంటోందను విషయం స్పష్టమైంది. ఇసి వాయిదా వేసిన నోటిఫికేషన్‌ వచ్చే వారంలో విడుదల చేసే అవకాశముంది. ఈ లోపే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై 'యుసిసి' వివాదాన్ని రాజేసింది.
దేశంలో భారత శిక్షా స్మృతి (ఐపిపి), పలు 'పర్సనల్‌ లా'లు అమలులో ఉన్నాయి. సంస్కృతి, సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకొని' పర్సనల్‌ లా' అమల్జేస్తున్నారు. వీటన్నటిని గంపగుత్తగా ఒకే ఛత్రంలోకి తీసుకురావాలన్నది బిజెపి వాదన. ఇలా చేయడం ద్వారా మైనార్టీలను ప్రత్యేకించి ముస్లిం మైనార్టీలను ఇబ్బందులకు గురిచేయాలన్నది ఎత్తుగడ. అయితే రాజకీయ, రాజ్యాంగ విశ్లేషకులు ఉమ్మడి పౌర స్మృతిని తప్పుబడుతున్నారు. రాజ్యంగ అసెంబ్లీలోనూ దీనిపై విస్తృత చర్చ జరిగిందని అనాడే దానిని తిరస్కరించారని గుర్తు చేస్తున్నారు. సంస్కృతీ, సాంప్రదాయాలను గౌరవించాలని, ప్రత్యేకించి మైనార్టీలు, గిరిజనుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరాన్ని నాటి పెద్దలు నొక్కి చెప్పారని, ఉమ్మడి స్మృతి మంచిది కాదని ఉద్ఘాటించారనివారు గుర్తు చేస్తున్నారు. భారతదేశానికి ఉన్న వైవిధ్య లక్షణం భిన్నత్వంలో ఏకత్వం. దీనిని పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఒకే పన్ను, ఒకే భాష, ఒకే కార్డు, ఒకే యూనిఫాం ఇప్పుడు ఒకే సివిల్‌ కోడ్‌ అంటూ భినుత్వాన్ని నాశనం చేసి ఏకరూప భారత్‌ను ఆవిష్కరించేందుకు విఫలయత్నం చేస్తోంది. వైవిధ్య లక్షణమైన భిన్నత్వాన్ని నాశనం చేస్తే అప్పుడు భారత్‌ ఉనికేముంటుందన్నది రాజకీయ విశ్లేషకులు ఆవేదన.