'పివో కె' పై బిజెపి ద్వంద్వ వైఖరి
పౌరసత్వం పై వింత ఆంక్షలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగమేనంటూ గొప్పగా ప్రకటిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నది.
ముజాఫర్‌బాద్, పూంచ్, మీర్‌పూర్, కుప్వారా, బందిపోరా తదితర ప్రాంతాల్లో
- పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కేంద్రం ద్వంద్వ వైఖరి
- పైకి భారత్‌లో అంతర్భాగమంటూ ప్రకటన
- అక్కడి పౌరులకు పౌరసత్వంపై వింత ఆంక్షలు
- ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోల్పోయిన పలువురు
- కేంద్రంపై ఆగ్రహం
- .. క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి
(స్పెషల్ టాస్క్ బ్యూరో నమస్తే తెలంగాణ ప్రత్యేకo):పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగమేనంటూ గొప్పగా ప్రకటిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నది. ముజాఫర్‌బాద్, పూంచ్, మీర్‌పూర్, కుప్వారా, బందిపోరా తదితర ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా నివసిస్తున్న పౌరులను కూడా భారత పౌరులుగా గుర్తించట్లేదు.
కేంద్ర ప్రభుత్వం పథకాలకు ఎంపికై, జాతీయ అవార్డుల నామినేషన్ వరకు వెళ్లిన ప్రముఖులకు కూడా పౌరసత్వం ఇవ్వకపోవడం గమనార్హం. భారత ప్రభుత్వమే తమను భారతీయులుగా గుర్తించనప్పుడు.. మిగతా వాళ్లు ఎలా గుర్తిస్తారని స్థానికులు వాపోతున్నారు. బీజేపీ సర్కారుకు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మారాయని మండిపడుతున్నారు.
స్కీమ్ లబ్ధిదారులుగా ఎలా చేర్చారు?
కుప్వారా జిల్లాలోని డ్రాగ్‌ముల్లా, బందిపోరా జిల్లాలోని హజీన్ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (డీడీసీ) ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నది. అయితే, డ్రాగ్‌ముల్లా సీటు కోసం బాతర్‌గామ్ ప్రాంతానికి చెందిన 37 ఏండ్ల సోమియా సదాఫ్ 2020లో పోటీపడ్డారు. నామినేషన్ దాఖలు చేశారు. పోలింగ్ జరిగింది. ఫలితాలు మరికొద్దిసేపట్లో విడుదల కాబోతున్నాయనగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పీవోకేకు చెందిన సదాఫ్ పౌరసత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో కౌంటింగ్‌ను నిలిపేశారు. హజిన్ సీటుకు పోటీపడ్డ మరో మహిళ షాజియా బేగంను కూడా ఇదే కారణంతో పక్కనబెట్టారు. 20, 30 ఏండ్లుగా తాము పీవోకేలోనే నివసిస్తున్నామని, కేంద్రప్రభుత్వం 'ఉమీద్’ స్కీంకు కూడా ఎంపికయ్యామని వారు చెప్తున్నారు. నామినేషన్ దాఖలు చేసినప్పుడు లేని అభ్యంతరాలు, ఫలితాల సమయానికి ఎలా లేవనెత్తుతారని ప్రశ్నిస్తున్నారు. భారత పౌరులం కానప్పుడు పథకాలకు తాము లబ్ధిదారులుగా ఎలా ఎంపికయ్యామన్నారు. జాతీయ అవార్డుల కోసం జమ్ముకశ్మీర్ యంత్రాంగం కేంద్రానికి సిఫారసు చేసిన పీవోకేకు చెందిన పలువురు వ్యక్తులకు కూడా సిటిజన్‌షిప్ ఇవ్వలేదని స్థానికులు వాపోయారు. ఈ మేరకు జాతీయ ఇంగ్లిష్ పత్రిక 'ది హిందూ' వెల్లడించింది.
సర్కారు సమస్య ఏంటి?
పీవోకే భారత్‌లో అంతర్భాగమైనప్పుడు, నా పౌరసత్వంపై ప్రభుత్వానికి సమస్యేంటి? 'ఉమీద్’ పథకం కింద డెయిరీ ఫామ్‌ను నెలకొల్పా. స్థానిక మహిళలకు ఉపాధి కల్పించా. ఇవన్నీ చూసే.. 2018లో అప్పటి జమ్ముకశ్మీర్ ప్రభుత్వం నన్ను నేషనల్ అవార్డుకు నామినేట్ చేసింది. అదే ఏడాది ప్రధాని నరేంద్రమోదీతో లైవ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నా. ఇప్పుడు నన్ను ఇండియన్ కాదంటున్నారు. అంటే, నేను నివసిస్తున్న పీవోకే ఇండియాది కాదా?
– సోమియా సదాఫ్, బాతర్‌గామ్