మసీదు? శివలింగం ? ఏదిముందు?
కొత్త వివాదంలో మసీదు బావిలో శివలింగం? 1991 చట్ట పరిధిలోకి?
అది ఫౌంటెన్ అంటున్న ఎంఐఎం ఓవైసి
ఉత్తర ప్రదేశ్ లోని వారణిశి కాశీ విశ్వనాథ్ దేవాలయం సమీపంలోని మసీదు వెలుపుల బయటపడినట్లు చెబుతున్న శివలింగం గురించి ఇప్పుడు ఒక్కో కధనం వెలుగులోకి వస్తున్నాయి.
మసీదును నిర్మించడానికి ఆలయాన్ని ధ్వంసం చేశారా ? లేదంటే ఆలయం ధ్వంసం చేసిన చోట మసీదు కట్టారా ? అసలు మసీదు ఉన్నచోట ఒకప్పుడు కాశీ విశ్వనాథుడి ఆలయం ఉండేదా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
లేదా ? అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ. జ్ఞానవాపి మసీదుకు వందల ఏళ్ల చరిత్ర ఉందని...ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటుందని చెబుతున్నారు.1834లో బ్రిటీష్ అధికారి జేమ్స్ ప్రిన్సెప్...ఈ మసీదును సందర్శించినప్పుడు దీన్ని గీశాడు. ఫొటోలో కూడా కనిపిస్తున్న స్తంభాలు నిశితంగా పరిశీలిస్తే హిందూ ఆలయాన్ని పోలి ఉన్నాయి. అప్పటి చరిత్రకారుడు సకీ ముస్తయిద్ ఖాన్ తన మాసిర్-ఎ-ఆలమ్‌గిరిలో ఆలయ కూల్చివేత గురించి ప్రస్తావించాడు. చక్రవర్తి ఆదేశం ప్రకారం అప్పట్లో అక్కడున్న కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చేసినట్టు అందులో ఉందంటున్నారు.
జ్ఞానవాపి మసీదు పశ్చిమ గోడ వెనుక శృంగార గౌరీ, గణేశుడు, హనుమంతుడు, నంది విగ్రహాలు ఉన్నాయి. సాధారణంగా శివాలయాల్లో నంది విగ్రహాలు గర్భగుడికి కొంచెం దూరంలో శివలింగానికి అభిముఖంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న నంది మాత్రం గర్భగుడి వైపు కాకుండా మసీదు వైపు చూస్తున్నట్లు ఉంటుంది. అంటే మసీదు ఉన్న ప్లేసే అసలు గర్భగుడి అని పిటిషన్లు వాదిస్తున్నారు. అయితే వేటికీ చారిత్రక ఆధారాలు లేవని ఇలాంటి వాదనలు ఎవ్వరూ నమ్మరంటున్నారు మస్లీం సంఘాలు.
చారిత్రక ఆధారాల ప్రకారం
నాలుగు - ఐదు శతాబ్దాల మధ్య కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణం జరిగింది, విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు.
ఆరో శతాబ్దంలో మన దేశ పర్యటనకు వచ్చిన చైనా యాత్రికుడు హ్యుయెన్ త్సాంగ్ కూడా వారణాసి ఆలయం గురించి ప్రస్తావించాడు
1194లో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్. కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆలయాన్ని కూల్చేసినట్టు చెబుతున్నారు
1211లో ఆలయాన్ని పునురుద్ధరిస్తే.. మళ్లీ 1489-1517 మధ్య సికందర్ లోఢీ హయాంలో కూల్చేశారు
అక్బర్ హాయాంలో మళ్లీ పునరుద్ధరించినా...ఆయన కుమార్తె ముస్లీం కుటుంబానికి కోడలుగా వెళ్లిందన్న కారణంతో అప్పట్లో బ్రాహ్మణులు ఆలయాన్ని బహిష్కరించారు
1585 లో అక్బర్ హయాంలో మరోసారి కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని పునరుద్ధరించారు.
ఔరంగజేబు మొఘల్ సింహాసనం సొంతం చేసుకున్న తర్వాత 1669లో మరోసారి ఆలయాన్ని కూల్చేసి..మసీదు నిర్మించారట
అయితే ఆఖరి దండయాత్ర...అంటే.. ఔరంగజేబు హయాంలో దండయాత్ర ఆలయంలో దండయాత్ర జరుగుతున్నప్పుడు అక్కడున్న పూజారి శివుడిపై భక్తితో పాటు ఆలయంలో ఉన్నబావిలో దూకేశారని. ఇప్పుడు బావిలో ఉన్న శివలింగం అదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఆలయాన్ని పూర్తిగా కూల్చకుండా మసీదు నిర్మించడం వల్లే గోడలపై దేవుడి బొమ్మలు అలాగే ఉండిపోయాయనే వాదన వినిపిస్తోంది.
1991లో పీవీ నరసింహారావు హయాంలో ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న మసీదులు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి. అయితే ఈ చట్టం చేయకముందే బాబ్రీ మసీదు వివాదం ఉండడంతో. అది ఈ చట్ట పరిధిలోకి రాలేదు. కానీ జ్ఞానవాపి వివాదం ఈ చట్ట పరిధిలో వస్తుంది. మరి ఈ వివాదానికి ఎలాంటి ముగింపు వస్తుందో చూద్దాం.