అప్పులు ఇచ్చేందుకు ఆర్ధిక మండలి ఏర్పాటుకు యోచన
రాష్ట్రాల అప్పుల పై
ఆందోళన చెందుతున్న కేంద్రం
Jul 24, 2022, 17:33 IST
|
రాష్ట్రాల అప్పులకు కేంద్రం ఆమోద మరింత కఠినతరం చేయాలని ఇందు కోసం సరికొత్త వ్యవస్థను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోందా అన్న ప్రశ్నకు అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
కొన్ని రాష్ట్రాలు ఎడా పెడా అప్పులు చేస్తూ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తున్నాయనే వాదనల నడుమ ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితులు రావచ్చునని పలువురు ఆర్థిక వేత్తలు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలంటే ఆర్థిక మండలిని(ఫిస్కల్ కౌన్సిల్) వేయాలని వారు ప్రధాని మోదీకి సూచించినట్లు తెలుస్తోంది. ద్రవ్యలోటును 2025-26 వరకు జీడీపీలో 4.5 శాతం మేరకు తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన ప్రకటనను ఆర్థికవేత్తలు సమర్థించారని, అదే సమయంలో రాష్ట్రాలు కూడా ఇదే విధంగా చర్యలు తీసుకునేలా చూడాలని వారు సూచించారని వెల్లడైంది.
CJI Ramana : టీవీ చర్చలు, సోషల్ మీడియా తీర్పులపై సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రాల్లో నిర్మాణాత్మక సంస్కరణలకు ద్రవ్య లోటుకు ముడిపెట్టడం మంచిదేనని, ప్రభుత్వ రుణాలను క్రమంగా త గ్గించేందుకు రోడ్ మ్యాప్‌ను రూపొందించడం, ఆర్థిక పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడం, అప్పులిచ్చే వాళ్లకు విశ్వాసాన్ని కల్పించడం కోసం ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలని ఎకనమిస్టులు ప్రధానికి స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ఖర్చును స్వతంత్రంగా నిష్పాక్షికంగా బేరీజు వే యాలంటే ఆర్థిక మండలి అవసరమని, ఆర్థిక పనితీరును లోతుగా సమీక్షించడం, దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరతకు అవసరమైన చర్యలను చేపట్టాల్సిందేనని 15వ ఆర్థిక సంఘం సైతం ఇదివరకే ప్రభుత్వానికి సూచించిన విషయాన్ని వారు గుర్తుచేశారట.
Twitter Tillu : ట్విట్టర్ టిల్లూ : అట్లుంటది కేటీఆర్-బండి సంజయ్ తోని! ఈడీ దాడిపై రచ్చరచ్చ
ఆర్థిక మండలి ఏర్పాటు ద్వారా రాష్ట్రాల నుంచి, కేంద్రం నుంచి ఆర్థిక లావాదేవీల రికార్డులను తెప్పించుకునే అధికారం ఉంటుందని, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని మండలి ద్వారా కట్టుదిట్టంగా ఆమలు చేసే అవకాశం ఉంటుందని నిపుణులు కేంద్రానికి సూచించారు. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత 50కిపైగా దేశాల్లో ఇలాంటి ఆర్థిక మండలులు ఏర్పాటు అయ్యాయని గుర్తుచేశారు. ఆర్థిక మండలి స్వతంత్ర వ్యవస్థగా పనిచేస్తుందని, నిష్పక్షపాతంగా సాంకేతిక అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలను పర్యవేక్షిస్తూ ఉంటుందని నిపుణులు పేర్కొన్నట్లు సమాచారం.
పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, రాజస్థాన్‌లలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితులు సమీప కాలంలో రావచ్చునని ఇప్పటికే అనేకమంది ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదీగాక, కేంద్రం ఈ విషయంలో సీరియ్‌సగా ఉన్నందువల్లే శ్రీలంకపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాల అప్పుల గురించి హెచ్చరించే ప్రయత్నం చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. భవిష్యత్‌లో కేంద్రం నేరుగా ముఖ్యమంత్రులకు ఈ విషయంలో హెచ్చరికలు చేస్తుందని ఆ వార్గాలు చెబుతున్నాయి. అయితే, అప్పుల నియంత్రణకు కేంద్రం యోచిస్తోన్న ఆర్థిక మండలి ప్రతిపాదనను విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ.