వందరూపాయల నాణెం పై ఎన్టీఆర్ శతజయంతి చిత్రం
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
పురంధేశ్వరి వివరణ
దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఎన్టీఆర్ బొమ్మను రూ.100 నాణెంపై ముద్రించేందుకు ఆర్‌బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వెల్లడించారు.
తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న రూ.100 నాణెం వాడుకలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
మరోవైపు మహానాయకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు తిరుపతి అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టమని.. రాజకీయ జీవితాన్ని తిరుపతి నుంచే ఆయన ప్రారంభించారని ఆమె గుర్తుచేశారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మరో పది నెలల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరూ శత జయంతి వేడుకలకు రావాలని పురంధేశ్వరి కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుపతిలో జరిగిన శత జయంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.