జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తిని మంత్రిగా ఎల కొనసాగిస్తారు?
ఢిల్లీ సిఎంకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్న
కొవిడ్ తదనంతరం త జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నానని సత్యేందర్ జైన్ ఈడీ ముందు చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. అటువంటి వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి చేతిలో కీలక విభాగాలు పెట్టి ఎలా పాలన చేస్తారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు.
కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే జూన్ 13వరకు సత్యేందర్‌ను ఈడీ విచారించింది. ఆ సమయంలో హవాలా లావాదేవీలకు సంబంధించి ప్రశ్నలు అడిగినప్పుడు.. తాను కొవిడ్ ఇన్‌ఫెక్షన్ ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోయానని జైన్ చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి ఈడీ విన్నవించినట్లు తెలుస్తోంది. వీటిని ప్రస్తావించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తారని ఆమ్‌ఆద్మీ పార్టీని ప్రశ్నించారు. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్‌లో ఆమ్‌ఆద్మీ తరపున పార్టీ కార్యకలాపాలకు ఇన్‌ఛార్చిగా ఉన్న సత్యేందర్ జైన్.. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను ఎలా గుర్తుపట్టగలరని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.పకశక్తి సమస్యలతో బాధపడుతున్నానని సత్యేందర్ జైన్ ఈడీ ముందు చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. అటువంటి వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి చేతిలో కీలక విభాగాలు పెట్టి ఎలా పాలన చేస్తారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు.
కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే జూన్ 13వరకు సత్యేందర్‌ను ఈడీ విచారించింది. ఆ సమయంలో హవాలా లావాదేవీలకు సంబంధించి ప్రశ్నలు అడిగినప్పుడు.. తాను కొవిడ్ ఇన్‌ఫెక్షన్ ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోయానని జైన్ చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి ఈడీ విన్నవించినట్లు తెలుస్తోంది. వీటిని ప్రస్తావించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తారని ఆమ్‌ఆద్మీ పార్టీని ప్రశ్నించారు. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్‌లో ఆమ్‌ఆద్మీ తరపున పార్టీ కార్యకలాపాలకు ఇన్‌ఛార్చిగా ఉన్న సత్యేందర్ జైన్.. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను ఎలా గుర్తుపట్టగలరని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.