home page

గాలిపై కూడా జీఎస్టీ వేస్తారు

అరవింద్ కేజ్రివాల్ ఆరోపణలు

 | 
Kejriwal
అరవిం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూకుడు పెంచింది. ఢిల్లీలో అధికారంలో వచ్చిన తర్వాత ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి ఫుల్ జోష్ లో ఉన్న ఆప్‌.

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్ పై కన్నేసింది. ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ అధికారం పీఠం దక్కించుకోవాలని ఆప్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. అక్కడి సర్కారుపై ఆప్ తీవ్ర విమర్శలు చేస్తోంది. కేజ్రీవాల్ గుజరాత్ లో వరుస పర్యటనలు చేస్తూ అక్కడి ఆప్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.

తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ మోడల్ ను గుజరాత్ లో కూడా అమలు చేస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇక్కడ కూడా నాణ్యమైన విద్యను అందించేందు చర్యలు తీసుకుంటూ.. స్కూళ్లు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్స్ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో శనివారం టౌన్ హాల్ ప్రసంగంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలను ఉచితాలు పేరుతో బీజేపీ రాద్దాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తమ పార్టీ ప్రజలకు 'ఉచితాలు' అందించడం కొనసాగిస్తుందని అన్నారు. "బీజేపీ దాని గురించి ఏమైనా చేయగలదు" అని కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌లో చేరాలని బీజేపీ కార్యకర్తలకు కోరారు. లేకపోతే బీజేపీలోనే ఉంటూ ఆప్ కోసం ప్రచారం చేయాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆప్ అధికారంలోకి వస్తే మెరుగైన పాలన అందిస్తామన్నారు.

ఆప్‌ అధికారంలోకి వస్తే ప్రతి పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ.10 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్‌లకు రూ.10వేలు, వీసీఈలకు రూ.20వేలు నిర్ణీత నెలసరి వేతనం అందిస్తామని పేర్కొన్న కేజ్రీవాల్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఈ హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పంచాయతీలో పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సర్పంచ్‌లు, వీసీఈలకు విజ్ఞప్తి చేస్తూ "బీజేపీ కార్యకర్తలు ఏం అందుకున్నారు? 'బీజేపీ నుంచి డబ్బులు తీసుకోండి కానీ ఆప్ పని చేయండి' అని పేర్కొన్నారు.

"సర్పంచ్‌లకు (గ్రామ పంచాయతీలు) నిధులు లేవు. మీరు ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల నుండి నిధులు అడిగితే, వారు కమీషన్ అడుగుతారు. మేము ఈ అవినీతిని అంత చేస్తాం. సర్పంచ్‌ల జీతాలు నిర్ణయిస్తాం. ఒక్కో సర్పంచ్‌కు నెలకు రూ.10వేలు అందజేస్తాము. ఇది తక్కువ అని నేను నమ్ముతున్నాను, కానీ ఇది ఒక ప్రారంభం మాత్రమే, ఇది మేము తరువాత పెంచుతుంటాము. చిన్న చిన్న పనులు చేయడానికి సర్పంచ్‌లకు నిధులు ఉండాలి, కాబట్టి ప్రతి పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం నుండి నేరుగా రూ. 10 లక్షల నిధులు అందుతాయి... కాబట్టి ఇప్పుడు మీరు ఎమ్మెల్యే లేదా జిల్లా అధికారుల ముందు అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది ఫిబ్రవరి 28 లోపు అమలు చేయబడుతుంది. వీసీఈలు కమీషన్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు.. వారికి నెలవారీగా రూ. 20,000 నిర్ణీత వేతనం ఇవ్వబడుతుంది. ఇది కూడా ఫిబ్రవరి 28 లోపు పూర్తి అవుతుంది" అని కేజ్రీవాల్ అన్నారు.

"వీసీఈలు, సర్పంచ్‌లు తమ గ్రామంలోని ప్రతి వ్యక్తికి తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రతి వ్యక్తి ఆప్‌కి ఓటు వేస్తారని నిర్ధారించుకోవాలి. వీసీఈలకు వారి స్వంత అసోసియేషన్ ఉది.. దాని ద్వారా మీరందరూ కనెక్ట్ అయ్యారు, కాబట్టి ఈ సందేశాన్ని ఈరోజే మీ WhatsApp గ్రూపులలో పంచుకోవాలని కోరుతున్నాను. ఈ విషయాలను అందరికీ తెలియజేయండి.. వారు వారి గ్రామాల్లో పని చేస్తున్నారా? లేదా? అనే దానిపై ఒక కన్ను వేసి ఉంచాలి. సర్పంచ్‌లు, మీలో కొందరు బీజేపీతో కూడా అనుబంధంగా ఉండాలి. గత 27 ఏళ్లలో బీజేపీ మీ కోసం ఏం చేసిందని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మీకు వారు ఏమి ఇచ్చారు? అవమానాలు, అగౌరవం, అమర్యాదలు- ఇవి కాకుండా, ఏమైనా ఇచ్చారా? నీళ్లు, పాఠశాలలు, కరెంటు, ఆసుపత్రి, ఏమైనా ఇచ్చారా?" అని ప్రశ్నించారు. అలాగే, తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్తు అందిస్తామంటూ హామీ ఇచ్చారు. "కరెంటు బిల్లులు జీరో చేస్తాను.. 24 గంటలు కరెంటు అందిస్తాం.. ఎంత ఖర్చు చేసినా ప్రతి పంచాయతీలో పాఠశాలలు తెరుస్తాం. ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్‌లు ప్రారంభిస్తాం. పంజాబ్‌లో 75 రోజుల్లో 100 క్లినిక్‌లను ప్రారంభించాం. 2-3 సంవత్సరాలలో పంజాబ్‌లోని ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్‌లు ఉంటాయి. గుజరాత్ లో కూడా అలాంటి చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు.