home page

అప్పుల కుప్పగా ఏపి : ఆర్బీఐ

మార్కెట్లో రుణాల ఊబిలో ఆంధ్రప్రదేశ్ 

 | 
Rbi

తెలంగాణ కొద్దిగా బెటర్

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ ముగిపోయిందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గురువారం విడుదల చేసిన ఓ బులెటిన్‌లో దేశంలోని అప్పుల్లో ఉన్న రాష్ట్రాల వివరాలు ప్రకటించింది.

ఆర్బీఐ చెప్పిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు శృతిమించిపోతున్నట్టు పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్దారించిన రుణ్, ఆర్థిక లోటు పరిమితులను ఆంధ్రప్రదేశ్‌ దాటేసిందని వివరించింది. జీఎస్‌డీపీలో తొమ్మిది శాతానికిపైగా బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అప్పు తీసుకుంటుందని తెలిపింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి నెలరోజుల్లోనే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, చేబదులు అవకాశాలను పూర్తిగా వాడేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఈ స్థాయిలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రేనని పేర్కొంది. తర్వాత స్థానాల్లో తెలంగాణ, మణిపూర్‌, నాగాలాండ్‌ ఉన్నట్టు ప్రకటించింది.

తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌కో ఒకే ఒక తేడా ఉందని ఆర్బీఐ వెల్లడించింది. బహిరంగ మార్కెట్‌లో రుణాలు తీసుకునే ఫెసిలిటీ తెలంగాణలో లేదని... ఆంధ్రప్రదేశ్‌కే ఉందని ప్రకటించింది. ఈ ఫెసిలిటీ ఉపయోగించుకొని ఏపీ నాలుగు వేల కోట్ల రుణం తీసుకుందని పేర్కొంది. కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణకు ఓపెన్ మార్కెట్‌లో అప్పులు తీసుకోలేకపోయిందంది. అందుకే తెలంగాణ చేబదులు, ఓడీ, ప్రత్యేక డ్రాయింగ్‌ ఫెసిలిటీపై ఆధారపడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం చేబదులు,, ప్రత్యేక డ్రాయింగ్ ఫెసిలిటీస్‌ వాడుకుంటూనే బహిరంగ మార్కెట్‌లో కూడా అప్పులు తీసుకున్నట్టు ప్రకటించింది ఆర్బీఐ.

జాతీయ సగటుతో పోల్చుకుంటే ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ఎనిమిది శాతం దాటిందని ఆర్బీఐ వెల్లడించింది. 2021-22 బడ్జెట్ ప్రకారం ఏపీ ఆదాయంలో 14 శాతం వడ్డీలకు వెళ్తోందని తెలిపింది. పంజాబ్‌ తర్వాత అత్యధిక మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నట్టు వెల్లడించింది. మొత్తం ఆదాయంలో 14.1 శాతం, సొంత ఆదాయంలో 30.3 శాతం ఉచిత పథకాలకు ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది వీటి కోసం 27,541 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్ట ఆర్బీఐ వెల్లడించింది.

గ్యారంటీల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఇస్తోందని ఆర్బీఐ వెల్లడించింది. మూడేళ్ల నుంచి ఇది పెంచుకుంటూ పోతున్నట్టు ఆర్బీఐ లెక్కలు చూస్తే అర్థమవుతోంది. 2017-18లో 4.6శాతం, 2018-19లో 6.2 శాతం, 2019-20లో 8.1శాతం, 2020-21లో 9 శాతానికి చేరిందని తెలిపింది.