అవినీతికి అడ్రస్ బిజెపి
బిజెపి బచ్చాఛోర్ పార్టీ: కేజ్రీవాల్
- బీజేపీ బచ్చా చోర్ పార్టీ అంటూ మండిపాటు
- హజారేను వాడుకుంటున్న బీజేపీ: కేజ్రీవాల్ విమర్శ
ఘజియాబాద్, ఆగస్టు 30:ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు చెందిన బ్యాంకు లాకర్లలో సీబీఐ మంగళవారం సోదాలు నిర్వహించింది. 'మా బ్యాంకు లాకర్లను సీబీఐ 2 గంటల పాటు సోదా చేసింది. అయితే వారికి ఏమీ దొరకలేదు. 70 వేల విలువైన వస్తువులు, మా కొడుకు బొమ్మ మాత్రమే దొరికాయి' అని సిసోడియా పేర్కొన్నారు.
సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందని పేర్కొన్నారు. సోదాల అనంతరం ఢిల్లీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఆపరేషన్ కమలం కోసం బీజేపీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై సీబీఐ దర్యాప్తు ఎప్పుడో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు నడ్డాను ప్రశ్నించారు. అలాగే నోట్ల రద్దు సమయంలో ఎల్జీ సక్సేనా 1400 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై దర్యాప్తు ఎప్పుడో చెప్పాలని డిమాండ్‌చేశారు. పెరుగు, పాలు, లస్సీ, తేనె వంటి తినే పదార్థాలపై వసూలు చేసిన జీఎస్టీని బీజేపీ తన ధనిక స్నేహితుల రుణాలు మాఫీ చేసేందుకు వాడుకుంటున్నదని ఆరోపించారు. ఇటీవల ఓ పసికందును బీజేపీ కార్పొరేటర్ కొనుగోలు చేసిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని బీజేపీని 'బచ్చా చోర్’ పార్టీ అంటూ దుయ్యబట్టారు.
అన్నా హజారేను వాడుకుంటున్న బీజేపీ
ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ అన్నా హజారే లేఖ రాయడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియా లాకర్లలో సీబీఐకి ఏమీ దొరక్కపోవడంతో బీజేపీ నిరాశ తో సామాజిక కార్యకర్త అన్నా హజారేను వాడుకుంటున్నదని దుయ్యబట్టారు. అయినా కూడా రాజకీయ కారణాలతో సిసోడియాను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పారు.ట