కిలో తగ్గితే వెయ్యి కోట్ల రూపాయల ఇవ్వాలి
తగ్గితే కిలోకు వెయ్యి కోట్లిస్తానని గడ్కరీ చెప్పడంతో ఈ బీజేపీ ఎంపీ ఏం చేశాడంటే..
: ఈ మధ్య కాలంలో చాలామందిలో కామన్‌గా కనిపిస్తున్న శారీరక సమస్య ఊబకాయం. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండటంతో రకరకాల అనారోగ్య సమస్యలు కూడా ఊబకాయంతో బాధపడే వారిని వెంటాడుతుంటాయి. ఇలానే అధిక బరువు కారణంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తుల్లో ఉజ్జయిని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా ఒకరు. 50 ఏళ్ల వయసున్న ఈయన గత ఫిబ్రవరిలో నియోజకవర్గ సమస్యలను విన్నవించుకునేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఎంపీ అనిల్ ఫిరోజియా బరువు 127 కిలోలు.
ఉజ్జయినీ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు తన మంత్రిత్వ శాఖ నుంచి నిధులు కేటాయించాలంటే బరువు తగ్గాలని ఫిరోజియాకు నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. గడ్కరీ ఛాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకున్న ఎంపీ అనిల్ ఫిరోజియా నాలుగు నెలల వ్యవధిలోనే కష్టపడి, కసరత్తులు చేసి 15 కిలోల బరువు తగ్గారు. 100 కిలోల కంటే తక్కువ బరువు ఉండటమే తన లక్ష్యమని ఎంపీ చెప్పారు. బరువు తగ్గడంపై ఉజ్జయిని ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. నితిన్ గడ్కరీ తనలో బరువు తగ్గాలన్న కాంక్షను రగిలించారని, బరువు తగ్గే ఒక్కో కేజీకి కేజీకి వెయ్యి కోట్లు చొప్పున నిధులు కేటాయింపు ఉంటుందని గడ్కరీ చెప్పారని తెలిపారు.
నాలుగు నెలల్లో 15 కిలోల బరువు ఎలా తగ్గారని ఎంపీని అడగ్గా ఆయన డైట్ సీక్రెట్ చెప్పారు. రోజుకు 2 నుంచి 3 గంటల వ్యాయామం (సైక్లింగ్, స్విమ్మింగ్.. ఇతరత్రా). దీంతో పాటు నాగ్‌పూర్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు ఇచ్చిన గైడెన్స్.. పంచకర్మ థెరపీ కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడినట్లు ఎంపీ తెలిపారు. సోమవారం తన బరువును చూసుకున్నానని, 112 కిలోలు ఉన్నానని.. ఆ రెండు కిలోలు కూడా తగ్గి 100 కిలోలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చారు. గడ్కరీ కూడా ఒకానొక సమయంలో 135 కిలోల బరువు ఉండేవారు. ఆయన ప్రస్తుతం 93 కిలోల బరువున్నారు. బరువు తగ్గాక చాలామంది తనను గుర్తుపట్టలేదని చెప్పారు. కేజీకి వెయ్యి కోట్లు ఇస్తానని మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. దీంతో గడ్కారీ మాట నిలుపుకోవాలంటే ఈ ఎంపీగారికే 13 వేల కోట్లు గడ్కరీ ఇవ్వాలి.
ఒక కేజీ బరువు తగ్గితే వెయ్యి కోట్ల నిధులు ఇస్తానంటూ గడ్కారీ ఓ ఎంపీకి ఇచ్చిన ఆఫర్ కథ ఇది. సదరు ఎంపీ ఒక కేజీ కాదు, భయంకరంగా వర్కౌట్లు చేసి 15 కేజీల బరువు తగ్గి, 'మాట ప్రకారం 15 వేల కోట్లు ఇవ్వండి' అని గడ్కరీ వెంట పడుతున్నాడు. మూడు నెలల కిందట గడ్కరీ మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. ఉజ్జయని ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు కావాలని ఆయనను అడిగారు.
తనలాగే అనిల్ కూడా లావుగా ఉండడంతో గడ్కరీ ఆట పట్టిపట్టించారు. 'నేను 135 కేజీల బరువు ఉండేవాడిని. కష్టపడి ఇప్పుడు 93 కేజీలకు చేరుకున్నాను. నువ్వు కూడా తగ్గు.
ఒక కేజీ తగ్గితే వెయ్యి కోట్ల చొప్పున ఇస్తా' అని అన్నారు. అనిల్ దీన్ని సీరియస్‌గా తీసుకుని మూడు నెలలుగా భారీ కసరత్తులు చేశారు. 125 కేజీల బరువు ఇపుడు 110 కేజీలు తూగుతున్నాడు. 15 కేజీలు తగ్గాను కాబట్టి గడ్కరీ మాట ప్రకారం 15వలే కోట్లు ఇవ్వాల్సిందేనని అంటున్నాడు!