home page

శివసేన రౌత్ పై 100 కోట్లు దావా

కిరిటి సోమయ్య భార్య మేధా పిటీషన్

 | 
Rout

సామ్నా పత్రిక ఎడిటర్ గా వున్న సంజయ్ రౌత్

శివసేన రాజ్య సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌పై  పరువునష్టం దావా దాఖలైంది. ఆధారాలు లేకుండా టాయిలెట్ స్కామ్ పేరుతో సామ్నా పత్రికలో వస్తున్న కథనాలు తమ పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ బీజేపీ లీడర్, ప్రొఫెసర్‌ మేధా బాంబే హైకోర్టులో రూ.100కోట్లకు దావా వేశారు. బిజెపి మాజీఎంపి కిరీటి సోమయ్య భార్య మేధా ఈ దావా దాఖలు చేశారు.

అంతే కాకుండా ఇకపై ఆ కథనాలను ప్రచురించకుండా ఉండటంతో పాటు క్షమాపణలు చెప్పాలని పిటిషన్ లో పేర్కొన్నారు. మహారాష్ట్ర(Maharashtra) బీజేపీ లీడర్ కిరీట్‌ సోమయ్య కుటుంబసభ్యులు ఓ ఛారిటబుల్ ట్రస్ట్ ను నడిపిస్తున్నారు. అయితే, బాంబే శివారులోని మీరా భయందర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రూ.100కోట్ల టాయిలెట్‌ స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తూ శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వరస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ విషయమై స్కామ్ లో సోమయ్యకూ భాగస్వామ్యం ఉందని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. మళ్లీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇతర మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, వీటిని ఖండించిన కిరీట్‌ సోమయ్య సతీమణి ప్రొఫెసర్‌ మేధా.. ఎటువంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మీడియాలో వచ్చిన కథనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత నెలలో ప్రొఫెసర్ మేధా పోలీసులను ఆశ్రయించారు. మీడియాలో వస్తోన్న వార్తలు తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని చెబుతూ బాంబే హైకోర్టులో దావా వేశారు. ఇందులో భాగంగా తనకు రూ.100కోట్ల మేరకు నష్ట పరిహారం పొందే అర్హత ఉందని, వాటిని సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో జమచేసేలా ఆమదేశాలు ఇవ్వాలని కోరారు.

మరిన్ని  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండిి.