చైనాతో చర్చలే మంచిది: దలైలామా
లఢాఖ్ లో నెలరోజులు పర్యటన
Updated: Jul 17, 2022, 06:36 IST
| చైనా ,భారతదేశం రెండూ ప్రత్యర్థి దేశాలే కాదు సన్నిహిత పొరుగు దేశాలు కాబట్టి, ఈ సమస్యను చివరికి సామరస్యంగా చర్చలు ద్వారా పరిష్కారం చేసుకోవాలని, యుద్ధం పాతపడిపోయిన అంశమని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. లఢాఖ్ పర్యటనకు వచ్చిన ఆయన జమ్మూ విమానాశ్రయం లో విలేఖరులతో మాట్లాడారు.
చైనా, భారత్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో దలైలామా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు నెలరోజుల పాటు దలైలామా ఇక్కడ వుంటారు. లఢాఖ్ ప్రజలు ఘనస్వాగతం పలికారు.