home page

హిట్ చిత్రాలకు చిరంజీవి ప్రశంస

తెలుగు సినిమాకు గొప్ప అవార్డు ఈచిత్రాలు

 | 
manchu vishnu comments on chiranjeevi

బింబిసార, సీతారామం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరిత్ర 

ప్రస్తుతం ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు విజయవంతం కావడంతో ఈ రెండు సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. అదే సీతారామం, మరొకటి బింబిసార. ఒకటి క్లాసికల్ లవ్ స్టోరీ అయితే మరొకటి మాస్ ఎంటర్ ట్రైనర్. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం విశేషం. అంతేకాదు.. రెండు సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కలెక్షన్లతో థియేటర్ల వద్ద కాసులు వర్షం కురిపిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు ఈ రెండు సినిమాలపై సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా జనం సీతారామం, బింబిసార సినిమాలపై స్పందిస్తూ.. పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఈ రెండు సినిమాలు ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా జోష్ నింపాయి. గత కొన్నిరోజులుగా థియేటర్లకు జనం రారని.. టెన్షన్ పడుతున్న సినిమావాళ్లకు కాస్త ఊరటనిచ్చాయి. దీంతో సెలబ్రిటీలు సైతం ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు.

తాజాగా సీతారామం’, ‘బింబిసార‌’ చిత్రాల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. ఆగస్ట్ 5 న విడుదలైన రెండు సినిమాలు `బింబిసార’, `సీతారామం’ హిట్ టాక్‌ తెచ్చుకోవడం విశేషం. ఓ సినిమా మాస్‌ కమర్షియల్‌ అంశాలతో మాస్‌ ఆడియెన్స్ ని మెప్పిస్తుంటే, మరో సినిమా స్వచ్ఛమైన ప్రేమ కథతో, పొయెటిక్‌ లవ్‌ స్టోరీతో క్లాసీ ఆడియెన్స్ హృదయాలను కొల్లగొడుతుంది. ఇలా `బింబిసార`, `సీతారామం’ రెండూ విజయవంతంగా రన్‌ అవుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా ట్విట్టర్‌ ద్వారా అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ” ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ, మరింత ప్రోత్సాహాన్నిస్తూ కంటెంట్‌ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న‌ విడుదలైన చిత్రాలు రెండు విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా `సీతారామం`, `బింబిసార` చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు” అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

మరోవైపు లైగర్ హీరో విజయ్ దేవరకొండ సైతం బింబిసార సీతారామం సినిమాలకు వస్తున్న టాక్ పై స్పందించాడు. ఒకే రోజున విడుదలైన రెండు సినిమాలు విజయాలు సాధించాయని వినడం చాలా సంతోషంగా ఉందని రౌడీ హీరో ట్వీట్ చేశాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, , సుమంత్ అన్న, హను రాఘవపూడితో పాటు ‘సీతా రామం’ చిత్ర బృందానికి కంగ్రాట్స్. సినిమా గురించి మంచి మాటలు వింటున్నానంటూ విజయ్ దేవరకొండ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇక బింబిసారపై కూడా విజయ్ స్పందించాడు. బింబిసారకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కళ్యాన్ రామ్‌తో టీం అందరికి శుభాకాంక్షలు తెలిపాడు.