home page

ఆర్ధిక శాస్త్రవేత్తలకు అవార్డులు

 | 
Awards

స్కాట్ హోమ్ : అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు బెన్‌ బెర్నాంకే, డగ్లస్‌ డైమండ్‌, ఫిలిప్‌ డైబ్‌విగ్‌ ఎంపికైనట్లు జ్యూరీ సోమవారం ప్రకటించింది.

బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై వారి పరిశోధనలకు గాను 2022 సంవత్సరం నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్లు తెలిపింది. బ్యాంకులు, బ్యాంకు నియంత్రణ, బ్యాంకింగ్‌ సంక్షోభాలు, ఆర్థిక సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాలపై అవగాహనను మెరుగుపరిచేందుకు వారి పరిశోధన దోహదపడిందని జ్యూరీ పేర్కొంది.
నోబెల్‌ బహుమతి గెలుచుకున్న ఆర్థికవేత్తల్లో ఒకరైన బెన్‌ బెర్నాంకే గతంలో ఫెడరల్‌ రిజర్వ్‌ చీఫ్‌గా విధులు నిర్వహించారు. ఇటీవల కరోనా మహమ్మారితో ప్రపంచం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభాలతో పాటు 2008లో తలెత్తిన ఆర్థిక మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వివరణనిచ్చినందుకు ఈ త్రయం పురస్కారాన్ని గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు, ఆర్థిక నియంత్రణ సంస్థలు వీరు పరిశోధనల నుంచి తీసుకున్న చర్యల ద్వారానే ఇటీవలి రెండు ప్రధాన సంక్షోభాలను ఎదుర్కోగలిగాయని జ్యూరీ అవార్డుల ప్రకటన సమయంలో పేర్కొంది.