home page

నా ప్రాణాలు కాపాడిన వారిని సస్పెండ్ చేస్తారా?

 | 
Raghu

ప్రజలకు మేలుచేసే బదులు కీళ్ళు 

సాధించాల్సింది..
ప్రజలకు మేలు చేయాల్సింది ఎంతో ఉంది

తన ప్రాణాలు కాపాడిన వారిని సస్పెండ్ చేస్తారా?

తన న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది

ప్రతిపక్ష నేతలు, ప్రజాస్వామ్యవాదులు అండగా నిలవాలి

కష్టకాలంలో దన్నుగా నిలిచిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తన ప్రాణాలను కాపాడిన సిఆర్పిఎఫ్ జవాన్లను సస్పెండ్ చేస్తారా? అంటూ నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలొడ్డిన వారిపై, దేశద్రోహి అని ముద్ర వేసినట్టుగా పోలీసు అధికారుల చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. సిఆర్పిఎఫ్ జవాన్లు ఉంగరాన్ని కొట్టివేస్తారా? అంటూ ప్రశ్నించిన ఆయన, చంపడానికి వచ్చిన వారిని అడ్డుకోవడం కూడా పోలీసు విధులకు భంగం కలిగించినట్లేనా?? అని నిలదీశారు.. తన ఇంటి వద్ద నెంబర్ లేని వాహనంపై వచ్చి అనుమానస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వివరాల గురించి ఆరా తీసినప్పుడు... పోలీస్ కానిస్టేబుల్ నని చెప్పాడని, అయితే ఐడి కార్డ్ చూపించాల్సిందిగా కోరగా, ఐడి కార్డ్ లేదని మీడియా ముందు ముఖం దాచుకున్న వ్యక్తిని, సిఆర్పిఎఫ్ జవాన్లు పోలీసులకు అప్పగించారన్నారు. అయితే సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు, సంఘటన స్థలంలో లేని వారిపై కూడా సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రోద్భలంతో కేసులు నమోదు చేశారని రఘురామకృష్ణం రాజు వివరించారు. స్టీఫెన్ రవీంద్ర ఎవరని ప్రశ్నించిన ఆయన, గతంలో ఉద్యోగానికి సెలవు పెట్టి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద ఇంటలిజెన్స్ విభాగంలో పని చేశారని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి అయితే అయి ఉండవచ్చు... తాను ఒక ఎంపీ నని తనకు ప్రశ్నించే హక్కు ఉందని చెప్పారు. ఇక సిఆర్పిఎఫ్ జవాన్ల మీద తప్పుడు కేసు నమోదు చేసి, 
 కేసు నమోదయిందన్న కారణంగా ఇద్దరు  జవాన్లను సస్పెండ్ చేసినట్లుగా సాక్షి దినపత్రిక కథనాన్ని ప్రచురించిందన్నారు.  ఒక ఎంపీ ప్రాణాలను కాపాడిన వారిని సస్పెండ్ చేస్తారా? అంటూ రఘురామ ఒంటి కాలుపై లేచారు. ఏపీ పోలీసు అధికారులతో స్టీఫెన్ రవీంద్ర కుమ్మక్కై తన  అధికారాన్ని దుర్వినియోగం చేసి, సిఆర్పిఎఫ్ జవాన్లను సస్పెండ్ కు కారణమై  ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై ఇప్పటికే న్యాయపోరాటం ప్రారంభించానని, కొనసాగిస్తానని తేల్చి చెప్పారు..

తన సెక్యూరిటీ తొలగించేందుకు కుట్రలు

తన కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను తొలగించే విధంగా నరహంతకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. భద్రత లేకపోతే సులువుగా హత్యకు పథక  రచన చేయవచ్చునని ఆయన భావిస్తున్నారేమోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాను తన భద్రత ను దుర్వినియోగపరచానని పేర్కొంటూ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా తెలిసిందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తనకు ప్రాణ హాని జరిగితే బారికేడ్లు కూడా ప్రజలను నియంత్రించలేవని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. తనకంతటి ప్రజా మద్దతు ఉందన్న విషయాన్ని రఘురామకృష్ణం రాజు చెప్పకనే చెప్పారు.  

సహచర ఎంపీలకు లేఖలు రాస్తున్న..

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా
తనకు ఎదురైన కష్టాలను వివరిస్తూ సమాచార పార్లమెంట్ సభ్యులందరికీ లేఖలను రాస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆయా రాష్ట్రాల వారికి ప్రాంతీయ భాషలతో పాటు, ఇంగ్లీషులో ఈ లేఖలను రాస్తున్నట్లుగా పేర్కొన్నారు. దుర్మార్గుడి నుంచి ప్రాణహాని ని ఎదుర్కొంటున్నానని, అతడికి పోలీసులు జత కలిశారని రఘురామ కృష్ణంరాజు ఆ లేఖలో వివరించినట్లుగా వెల్లడించారు. అలాగే గత  ఏడాది తనపై పోలీసు లాకప్ లో జరిగిన హత్యాయత్నం గురించి వివరిస్తూ, ఫోటోలను జతచేస్తూ 800 మంది రాజ్యసభ,  లోక్ సభ సభ్యులకు లేఖలు రాస్తూ... గత 30 నెలలుగా తనని నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న విధానాన్ని వివరించారు. తనపై ఇప్పటికే రెండుసార్లు అధ్యయనం చేశారని పేర్కొన్న ఆయన, పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కాగానే ప్రతి ఎంపీ ఇంటికి వెళ్లి కలిసి మద్దతు కోరుతానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు ఈ ఆపద సమయంలో తనకు అండగా నిలవాలని కోరారు. 

బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు

తాను కోరిన వెంటనే స్పందించి మదనపల్లిలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధినేత , ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రఘురామకృష్ణం రాజు ఈ సందర్భంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేశారు.. కష్టం వచ్చినప్పుడు ఎవరైనా మన గురించి మాట్లాడితే ఓదార్పుగా ఉంటుందన్నారు. మిగతా పార్టీల నాయకులు కూడా తనకు అండగా నిలవాలని మరొకసారి రఘురామకృష్ణం రాజు విజ్ఞప్తి చేశారు.. తమ పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీలు ప్రజలు లేక వెలవెల పోతుంటే, మదనపల్లిలో నిర్వహించిన మినీ మహానాడు కు మాత్రం స్వచ్ఛందంగా లక్షలాది మంది జనం హాజరు అయ్యారని రఘురామ అన్నారు. బస్సులు పెట్టి, బిర్యానీ పొట్లాలను పంచిన ముఖ్యమంత్రి సభలకు, తమ పార్టీ ప్లీనరీలకు జనాలు ముఖం చాటేస్తున్నారన్నారు. చివరకు ప్లీనరీ సభలో కూడా డ్వాక్రా మహిళలను అరువు తెచ్చుకోవలసిన దుస్థితి తమ పార్టీకి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

8 వేల స్కూళ్ల మూసివేతకు ప్లాన్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయకపోయినా సరే... కానీ ఉన్న 8 వేల స్కూళ్లను మూసి వేసేందుకు చర్యలు తీసుకోవడం దుర్మార్గమని రఘురామకృష్ణం రాజు అన్నారు. స్కూళ్ల మూసివేతతో పాటు, ఉపాధ్యాయుల  పోస్ట్లలోను కోత విధించాలని నిర్ణయించారన్నారు.. ఇక రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా మాతృభాషలో ప్రాథమిక విద్యను అందించకుండా, ఎనిమిదో తరగతి వరకు పరాయి భాష అయిన ఇంగ్లీష్ మాధ్యమంలో పాఠశాలలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయమై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారాన్ని అందించిందని రఘురామ అన్నారు. ఇప్పటికే 8వ తరగతి వరకు ఆంగ్ల భాషలోనే విద్యా బోధన అని ముఖ్యమంత్రి చెబుతుంటే, అడ్వకేట్ జనరల్ మాత్రం ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతూ కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారన్నారు. మదనపల్లి సభలో ఇదే విషయమై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఊరికి ఒక పాఠశాల ఏర్పాటు చేసి లక్ష 60 వేల టీచర్ ఉద్యోగాల కల్పనకు కృషి చేసినట్లుగా  చెప్పారని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రస్తావించారు. అయితే నూతన పాఠశాలలు ఏర్పాటు చేయకపోయినా, ఉన్న పాఠశాలలను మూసివేయడం ఏమిటంటూ విద్యార్థులే రోడ్డుకి ఆందోళన చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అమ్మ ఒడి వద్దు... బడే ముద్దు అంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన గురించి  తమ వంటి వారు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు. ఒకవేళ ఎవరైనా పత్రికలో రాస్తే ఎదురు కేసులు తమ వంటి వారు ప్రశ్నిస్తే గొడ్డు ను బాదినట్లుగా బాదుతారన్నారు. ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలను గొప్పలు పోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పటివరకు సగం పాఠశాలలకు పుస్తకాలు బ్యాగులను అందజేయలేకపోయారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

పులివెందుల గ్రామ సింహానికి బారికేడ్లను ఎందుకు?

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 
పర్యటన సందర్భంగా రక్షణ నిమిత్తం బారికేడ్లను ఏర్పాటు చేయడం ఎందుకని రఘు రామ కృష్ణం రాజు ప్రశ్నించారు. గ్రామ  ప్రజల నుంచి సింహానికి కి రక్షణ ?, లేకపోతే  సింహం నుంచి గ్రామ ప్రజలకు  రక్షణ ??  అని  ప్రశ్నించారు. రచ్చబండ కార్యక్రమం ప్రారంభంలో నీతి నీతులు చెప్పేవారని, ఇప్పుడు నీతులు ఆపివేసి బూతు లు మాట్లాడుతున్నారని కొంతమంది తన శ్రేయభిలా షులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. అయితే 
తాను కొంతమంది వెధవలు చేసిన ట్వీట్ లపై స్పందిస్తూ
భావావేశంతో  మాట్లాడిన,  మాటలు కొందరు తన అభిమానులకు నచ్చ లేదని, ఇకపై రచ్చబండ కార్యక్రమం లో తాను  అసభ్య పద జలాన్ని ఉపయోగించనని ఈ సందర్భంగా ప్రకటించారు.