home page

వార్షిక కౌలు ఎందుకు చెల్లించలేదు

జగన్ సర్కారు కు హైకోర్టు ప్రశ్న: సమాధానం చెప్పాలి 

 | 
hc

రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లించకపోవడంపై వివరణ ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఏపీ హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీసీఆర్డీఏ కమిషనర్‌, ఏపీసీఆర్డీఏ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది.

ఇదిలావుంటే ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని మంగళగిరికి చెందిన పోతినేని శ్రీనివాసరావు సవాల్‌ చేశారు. తనకు చెల్లించాల్సిన రూ.8.48 లక్షల వార్షిక కౌలును తక్షణం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. ఈ ఆలస్యానికి 12శాతం వడ్డీ చెల్లించేలా ఆదేశించాలని.. భూ సమీకరణ యాజమాన్య పత్రాలను ఇవ్వకపోవడాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.

రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా మార్చి 1వ తేదీనాటికి సీఆర్డీఏ వార్షిక కౌలు చెల్లించాలని పిటిషనర్ తరపు లాయర్ గుర్తు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 75 జారీ చేసిందని.. ప్రతి ఏడాది వార్షిక కౌలు చెల్లించడంలో అధికారులు జాప్యం చేయడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ వివరాలను పరగణనలోకి తీసుకున్న జడ్జి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

ఈ క్రమంలోనే రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లించకపోవడంపై వివరణ ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఏపీ హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీసీఆర్డీఏ కమిషనర్‌, ఏపీసీఆర్డీఏ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.