home page

నిజమైన బీసీ నాయకుడు ఎన్టీఆర్

బడుగులకు రాజకీయాధికారం ఇచ్చిన ఘనత

 | 
Ntr

దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్

బీసీలకు సముచిత స్థానం కల్పించిన నాయకుడు

నటుడిగా... మహా నాయకుడిగా ఆయనకు ఆయనే సాటి

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని.. పార్టీలు, ప్రాంతాలకతీతంగా  తెలుగువారంతా ఏకమవ్వాలి

తెలుగుజాతి మరిచిపోలేని... ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్


 అధికారం లేని ఉద్యోగాలు ఇచ్చిన అందుకే జయహో జగనన్న అంటున్న 17 మంది

మహానాడుకు బారులు తీరిన మహిళలు

అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే, సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు దక్కుతుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు అన్నారు.  తామే తొలుత సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు గా  ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లు పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు.  దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీ రామారావని చెప్పారు.  ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని రఘురామకృష్ణంరాజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఎన్టీ రామారావు సినీ రాజకీయ జీవితంలో సాధించిన మైలురాళ్ల  గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలుగు జాతి గౌరవాన్ని నలుచెరుగులా చాటిన మహానుభావుడైన ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారాన్ని అందజేయాలని కోరుతూ ...  ప్రతి ఒక్క తెలుగు వారు పార్టీ లు, ప్రాంతాలకతీతంగా ప్రధాని, రాష్ట్రపతి కార్యాలయాలకు మెయిల్ చేసి అభ్యర్థించాలని  పిలుపునిచ్చారు. ఎన్టీరామారావు సాధించిన ఘనత ముందు భారత రత్న పురస్కారం... గొప్పేమీ కాదని, కాకపోతే ఆయనకు ఆ అవార్డు ఇవ్వడం సముచితంగా ఉంటుందన్నారు.తెలుగు వారందరిని మద్రాసీలు గా పిలిచే వాళ్లని, తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చిన ఘనత ఎన్టీరామారావు దేనని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. 

పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ నాంది

సమాజంలోని పేదల అభ్యున్నతే లక్ష్యం గా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీ రామారావు ...
రెండు రూపాయలకు కేజీ బియ్యం, పేదలకు జనతా వస్త్రాల పంపిణీ కి చర్యలు తీసుకున్నారని అని రఘు రామ కృష్ణం రాజు తెలిపారు. ఇక  ముందు చూపుతో వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన  ఘనత ఎన్టీఆర్ దే నని అన్నారు.. ప్రజలకు అందుబాటులో పరిపాలనా వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో మండల వ్యవస్థను ప్రవేశపెట్టడమే కాకుండా,  పటేల్,  పట్వారీ వ్యవస్థ రద్దు ద్వారా ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చారని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.  బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే నని, అయితే ఇప్పుడు కొందరు తామేదో బీసీలకు ఎంతో చేశామని చెప్పుకోవడమే తప్ప, చేసిందేమీ లేదన్నారు.  రాయలసీమ కరువు ను కట్టడి చేయడానికి సాగు, తాగునీటి ప్రాజెక్టులకు ఎన్టీరామారావు శ్రీకారం చుట్టారన్నారు.. గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆయనే ప్రారంభించారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. 

గొప్ప దార్శనికుడు ఎన్టీఆర్

సామాజిక సందేశాత్మక చిత్రాల్లో నటించిన ఎన్టీ రామారావు, పౌరాణిక చిత్రాలలో కృష్ణుడిగా, రాముడిగా ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్నారని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. కృష్ణుడు, రాముడి పాత్రలను పోషించే సమయం లో  శాకాహారాన్ని మాత్రమే భుజిస్తూ, నేల పై పడుకునే వారన్న రఘు రామ, దాన వీర శూర కర్ణ సినిమా ద్వారా కుల వ్యవస్థను ప్రశ్నించారన్నారు. ప్రపంచంలో ఎవ్వరు సాధించలేని విధంగా, 41 రోజుల్లోనే యుద్ధ సన్నివేశాల తో సహా సినిమా చిత్రీకరణ పూర్తి చేయగలిగా రంటే,  అది మానవమాత్రులకు మాత్రం సాధ్యం కాదని పేర్కొన్నారు.  ఎన్టీ రామారావు నటించిన చిత్రాలలో అత్యధిక సినిమాలు విజయం సాధించాయన్నారు. ఎన్టీఆర్ తో సినిమాలు నిర్మించిన వారెవ్వరు ఆర్థికంగా నష్టపోయిన దాఖలాలు లేవన్నారు.  

తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి...
తెలుగుదేశం పార్టీని స్థాపించి,  రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలిలా పర్యటించి, తొమ్మిది నెలల్లోనే ఎన్టీరామారావు అధికారాన్ని చేజిక్కించుకున్నారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకలించిన ఘనత ఎన్టీఆర్దేనని చెప్పారు. ఆయన ఉన్నప్పుడు మనము ఉండడం... ఆయన  నడయాడిన నేల పై మనము కూడా నడవడం అదృష్టమని రఘురామ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. 

తోపులాట నిజమే ... కానీ బోత్ ఆర్ నాట్  సేమ్ 

ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో, అధికార పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక న్యాయ బేరి, జయహో జగనన్న ట్యాగ్ లైన్ తో చేపడుతున్న కార్యక్రమాలలో తోపులాట జరిగిన మాట నిజమేనని, కానీ  మహానాడు వేడుక నిర్వహిస్తున్న ప్రాంగణంలోకి వెళ్లేందుకు తోపులాట జరిగగా,  సామాజిక న్యాయ బేరి ఈ కార్యక్రమానికి బలవంతంగా తీసుకు వచ్చినవారు, ఆ ప్రాంగణం నుండి బయటపడేందుకు తోపులాట లాడా రని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాజమండ్రి పరిసర గ్రామాలకు 10 బస్సులను పంపితే, కేవలం మూడు బస్సుల్లోనే జనాలు న్యాయ బేరి సదస్సుకు హాజరయ్యారన్నారు. వారిని కూడా అన్ని విధాలుగా అధికార పార్టీ నేతలు పెట్టడమే కాక, బెదిరింపులకు దిగారన్నారు. ప్రజలు మన పార్టీ, ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న సభలకు ఎందుకు ముఖం చాటేస్తున్నారో ఆలోచించుకోవాలని అన్నారు.
అధికారం లేని మంత్రిపదవులు ఇచ్చినందుకు 17 మంది జయహో జగనన్న అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారని... అయితే మీకు ఉద్యోగాలు ఇస్తే , మాకు వచ్చిన లాభం ఏమిటని బీసీ ,ఎస్సీ, మైనార్టీ వర్గాల ప్రజలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెబుతారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. సత్తిబాబు కు మంత్రి పదవి ఇచ్చినందుకు తూర్పుకాపులు, తానేటి వనిత కు, నాగార్జునకు పదవి ఇచ్చినందుకు బీసీ ఎస్సీ వర్గాలు ఓట్లు వేయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  ముఖ్యమంత్రి,. మంత్రి పదవుల అధికారాన్ని వెలగబె ట్టేది సజ్జల రామకృష్ణారెడ్డి అయితే, అధికారం లేని మంత్రి పదవులు 17 మందికి ఎందుకన్నారు. ఎస్సీలకు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్న ఆయన, విద్యా వ్యవస్థను అమలు చేయాల్సిన స్కీములను కూడా ఎందుకు అమలు చేయటం లేదంటూ ... తమ గురించి పట్టించుకోరా? అని ఎస్సీలు ప్రశ్నిస్తే మంత్రులు ఏమి సమాధానం చెబుతారన్నారు.  బీసీల సంక్షేమ పథకాలు అటకెక్కాయని, స్వయం ఉపాధి పథకాలు అమలు కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తే 17 మంది మంత్రులు ఇచ్చే సమాధానం ఏమిటో చెప్పాలన్నారు. మైనార్టీ ఎమ్మెల్యేకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన... వైయస్సార్ దులహన్ పథకం అమలు చేయడం లేదని, ఇక రాష్ట్రంలోని మహిళలకు ఇచ్చిన మద్యనిషేధం హామీకి తూట్లు పొడవడం పై ప్రశ్నిస్తే మంత్రుల వద్ద సమాధానం ఉందా? అని  నిలదీశారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో నిరసన స్పష్టంగా కనిపిస్తోందని, దాన్ని తెలుసుకోవాలన్నారు. మహానాడు కార్యక్రమానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు బారులుతీరారని, బుల్లెట్ లపై హాజరయ్యారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అనే నినాదం ఇస్తే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అంతమొందించాలని చూస్తున్నారని ఒక మంత్రి వ్యాఖ్యానించడం పరిశీలిస్తే, మంత్రులు ఎంతటి ఆత్మన్యూనతా భావంతో ఉన్నారో ఇట్టి అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మూడు లక్షల ఇళ్లు నిర్మిస్తే, వాటిని పూర్తి చేసి ఇ ఎస్సీ ఎస్టీ బిసి వర్గాలకు అందించాల్సి ఉంది పోయి, తమకేమీ పట్టనట్లు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కొత్తగా మూడు ఇళ్లను కూడా నిర్మించలేక పోయిందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.