కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర
పశ్చిమగోదావరి జిల్లాలో అడుగడుగునా ఆటంకాలు
ద్వారకా తిరుమలలో అడ్డగింత :అయినా ఆగని రైతులు
అద్భుతంగా కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర....
ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో కొనసాగుతున్న అమరావతి రైతులు పాదయాత్రలో భాగంగా ఆదివారం ద్వారకాతిరుమల నుంచి కొనసాగుతున్న పాదయాత్రలో కె ఎస్ జవహార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల మీద కోపంతో దళిత రాజదాని అయిన అమరావతిని కమ్మ రాజధానిగా మార్చారని అమరావతిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు దళితులవని అలాగే అమరావతి పార్లమెంట్ కూడా దళితులదన్న కక్షతో అమరావతిని కమ్మ రాజధానిగా మార్చారని రాష్ట్రంలోని దళితులందరూ కూడా దీనిని అర్థం చేసుకుని అమరావతి రైతు పాదయాత్రకు సహకరించాలని కోరారు.
మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం తర్వాత అత్యంత పవిత్రమైన ఉద్యమం అమరావతి ఉద్యమంమన్నారు.మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి కులాల మధ్య,ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి మూడు రాజధానులు అంటున్నాడని ఏడుస్తున్నవ్ ఎందుకురా అంటే ఎకొట్టడానికి అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.ఈ పాదయాత్రలో చాగల్లు మండలం సీనియర్ నాయకులు కరుటూరి సతీష్,జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.