మీటర్లపై అమిత్ షాకు షాక్ ఇచ్చిన తెలంగాణ రైతులు
మీటర్లు బిగించేదిలేదని తెగేసి చెప్పిన రైతు
Updated: Aug 21, 2022, 18:44 IST
| తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రైతులు షాక్ ఇచ్చారు. ఎయిర్ పోర్టులో రైతులు, రైతు సంఘాల నాయకులతో భేటీ అయిన అమిత్ షాకు ఊహించని రీతిలో రైతులు వ్యవసాయ మీటర్లపై ఘాటుగా సమాధానం ఇచ్చారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడానికి తెలంగాణ రైతులు సిద్ధంగా లేమని చెప్పారు. దీంతో అసహనానికి గురైన అమిత్ షా ముందు కేసిఆర్ ప్రభుత్వాన్ని దించాలని అంటూ కోపంగా సమావేశం ముగించుకుని వెళ్ళిపోయారు.