home page

పవన్ కల్యాణ్ రాజకీయ విడాకులు!

బిజెపితో బంధం తెగిపోతుందా?

 | 
Pawan

దేశంతో జనసేన బంధం బలపడుతుందా?

బీజేపీకి పవన్ విడుపు కాయితం ఇచ్చినట్టేనా
***
కమలం పార్టీకి దూరంగా జనసేన
***
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నట్లా లేనట్లా. ..రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీతో కలిసి వెళతారా విడుపు కాయితం ఇచ్చేసి ఒంటరిగా వెళ్తారా.. లేదా టీడీపీతో కలిసి నడుస్తారా.. ఏమో..ఇంకా ఏదీ క్లారిటీ లేదు.. టీడీపీతో కలిసి వెళ్తారో లేదోగాని బీజేపీతో మాత్రం కటీఫ్ అయినట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటోంది. బిజెపి తనను పెద్దగా పట్టించుకోవడం లేదని ఫీలవుతున్నారో లేదో గానీ కమలం పార్టీ పెద్దలు, సాక్షాత్తు ప్రధాన మంత్రి మోడీ పాల్గొనే సభకు పిలుపు వచ్చినా పవన్ హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు.
రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం వల్ల ఏర్పడిన ఖాలేజీ ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన బిజెపి తరఫున ప్రచారం చేయలేదు సరికదా కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా బిజెపికి మద్దతును ప్రకటించలేదు.
 ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు పవన్ కల్యాణ్ హాజరుకాలేదు.
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్న ఆ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ఎటెండ్ కాలేదు. 
అదేవిధంగా తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ వీడ్కోలు సభకు ఢిల్లీకి రావాల్సిందిగా పవన్ కల్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆహ్వానించారు. అయితే అనారోగ్యాన్ని సాకుగా చూపి ఆ కార్యక్రమానికి కూడా పవన్ డుమ్మా కొట్టే అవకాశాలున్నాయి. ఇదే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరు కానున్నారు. వరుస సంఘటనలు, ఈ పరిణామాలు చూస్తుంటే పవన్ బిజెపి నుంచి దూరం జరిగేందుకే మొగ్గుచూపుతున్నారని భావిస్తున్నారు. బిజెపి, టిడిపి, పవన్ కలిసి వెళ్లాలని ఆయన ఆశిస్తున్నా టీడీపీని కలుపుకునే పరిస్థితుల్లో బిజెపి లేకపోవడంతో పవన్ కాస్త నిరాశ చెందారని అందుకే తనుకూడా బీజేపీని వదిలి తెలుగుదేశంతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.