home page

బాలినేనికి 'ఇరిటేషన్'

సొంత పార్టీలోనే తిరుగుబాటు 

 | 
Balineni
బలినేనికి ఇరిటేషన్!!
***
ఎవరా ఇద్దరూ....
ఆవిర్భావం నుంచి, ఇంకా చెప్పాలంటే ఇంకా ముందునుంచే పార్టీలోనే ఉంటూ, నిరంతరం పార్టీ కోసం కష్టించే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇబ్బందులు మొదలయ్యాయా? పార్టీ ప్రతి పక్షంలో ఉన్నన్ని రోజులు, అంటే గత పదేళ్లుగా ఒంగోలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా నిలుస్తూ వచ్చిన బాలినేనికి ఎదురెళ్లి ఆయన్నే ఇరిటేట్ చేస్తున్నారా? ఎవరు వారు? నేరుగా జగన్నే ప్రశ్నించే స్థాయి ఉన్న వాసన్న పెద్దరికాన్ని సవాల్ చేసే వాళ్లెవరు? ఈ మధ్య గత కొన్ని నెలలుగా ఆయన పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన వెంట తిరిగేవాళ్లే ఇప్పుడు ఇబ్బందిగా పరిణమించారు. ఈమధ్య వరకూ జిల్లా మొత్తాన్ని శాశించే స్థాయిలో ఉండే బాలినేని ఇప్పుడు తనకే పార్టీలో రక్షణ లేదని, తన వెంట గోతులు తీస్తూ అప్రదిష్ట పాల్గోసేందుకు పార్టీ ముఖ్యులే కుట్రలు పన్నుతున్నారని వాపోతుండడం చూస్తుంటే లోలోపల ఏదో పెద్ద తతంగమే నడుస్తున్నట్లు అని పిస్తోంది. బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్న బాలినేనికి ప్రజలు, పార్టీలో ఉన్న పట్టును సడలింపజేసేందుకు. ఆయన్ను బదనాం చేసేందుకు సొంత పార్టీ మనుషులే లోలోన కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆయన చేస్తున్న ఆరోపణలను బట్టి తెలుస్తోంది. ఆయన మాటలను బట్టి చూస్తుంటే పార్టీలోని వైరి వర్గం అయిన ఇద్దరు ముఖ్యులు చేతులు కలిపి బాలినే 
ని, ఆయన
 కుమారుడు ప్రణీత్ రెడ్డిలను బదనాం చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయనకు ఉన్న పలుకుబడిని పలుచన చేసే ఉద్దేశ్యం ఉన్నట్లు తెలుస్తోది. వేరే రాష్ట్రంలో ఎవరి దగ్గరో భారీ ఎత్తున హవాలా డబ్బు పట్టుబడినా అది కూడా ఈయన ఖాతాలోకి వేయడం, జనసేన పార్టీకి చెందిన ఓ మహిళతో కూడా బాలినేని వే ళకానివేళ అసందర్భంగా మాట్లాడారంటూ కాల్ రికార్డ్స్ బయటకు రావడం ఇవన్నీ తనను బదనాం చేసే చర్యల్లో భాగమే అని ఆయన అంటున్నారు. ఈ కుట్రలో తమ పార్టీకి చెందిన మండల స్థాయి నాయకులు పాత్రధారులు కాగా పార్టీ పెద్దలు సూత్రధారు లు అన్నది బాలినేని ఆరోపణ. వాస్తవానికి ఆయన్ను మొన్నటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి నుంచి తొలగించిన నాటి నుంచి ఆయన్ను ఇబ్బంది పెట్టే వైరివర్గాలు మరింత పుంజుకోవడం మొదలు పెట్టాయి. ఆయన్ను తొలగించడం, ఆదిమూల పు సురేష్ వంటి జూనియర్లను కొనసాగించడం వంటి చర్యలు బాలినేనిని బాగా ఇబ్బం ది పెట్టాయి. సురేష్కు తోడుగా వైవి సుబ్బారెడ్డి కూడా చేతులు కలిపి తనను ఇబ్బంది. పెడుతున్నట్లుగా బాలినేని ఆరోపణలు అర్థం అవుతున్నాయి. మరి ఆయన ఆవేదన పార్టీ అధినేత దృష్టికి వెళుతుందా? ఆయన సాల్వ్ చేస్తాడా? ఆయనకు తెలిసే ఇదంగా
జరుగుతుందా అన్నది చూడాలి.