ఛలో నెల్లూరు: ఎక్కడికక్కడే అరెస్ట్ : గృహ నిర్బంధం
Jul 14, 2022, 17:40 IST
|
*ఉదయగిరి నారాయణ ప్రాణాలు తీసిన ఎస్సై కరిముల్లాను వదిలిపెట్టే ప్రసక్తేలేదు..జైలు ఊచలు లెక్కపెట్టించి తీరుతాం*
*ఇప్పటికే పది కేసుల్లో ముద్దాయి అయిన ఎస్సై కరిముల్లా కాకాణి గోవర్ధన్ రెడ్డి అండతో చెలరేగిపోతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నాడు*
*ఎందరో అమాయక కుటుంబాల ఉసురుపోసుకుంటున్న ఎస్సైపై చర్యలు తీసుకునే దమ్ములేక ఎస్పీ ఆయనను వెనకేసుకురావడం దురదృష్టకరం*
*తెలుగుదేశం కార్యకర్తలపై పోలీసులు ఒక్క చేయివేస్తే మా వైపు నుంచి లక్షల చేతులు లేస్తాయని గుర్తుంచుకోండి*
*అల్లీపురంలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*ఛలో నెల్లూరు కార్యక్రమానికి బయలుదేరిన సోమిరెడ్డిని అల్లీపురంలోని ఇంటి వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు*
*ఇంటి ఆవరణలోనే బైఠాయించి పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన సోమిరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు*
*సోమిరెడ్డి కామెంట్స్*
వైసీపీ ప్రభుత్వంలో పోలీసుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది
ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరిని కొట్టమంటే వారిని కొట్టడం, ఎవరిని హింసించమంటే వారిని హింసించడమే పనిగా కొందరు పోలీసులు ఉన్నారు
ప్రజలను రక్షించాల్సిన పోలీసులే వారి చావులకు కారణమవుతున్నారు..రక్షకులే భక్షకులుగా మారడం బాధాకరం
పొదలకూరు ఎస్సై కరిముల్లా ఒక అధికారిగా కాక కాకాణి గోవర్ధన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా వ్యవహరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు
ఉదయగిరి నారాయణ తన కుటుంబాన్ని దిక్కులేనిదిగా చేసి వెళ్లిపోవడానికి కారణం కరిముల్లానే
మొదట నారాయణ భార్యతో తన భర్త చావుకు ఎవరూ కారణం కాదని బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నారు
తెలుగుదేశం పోరాటం చేపట్టడంతో నారాయణపై ఫిర్యాదు చేసిన వంశీనాయుడుపై కేసు నమోదు చేశారు
నారాయణను దారుణంగా కొట్టి చంపిన ఎస్సై కరిముల్లా పేరును మాత్రం కేసులో లేకుండా చేసేశారు
ఇలాంటి అరాచకాలు, దారుణాలు ఎస్సై కరిముల్లాకు కొత్తేమి కాదు
వెంకటాచలం ఎస్సైగా ఇతను కొట్టిన దెబ్బలకు షేక్ ఉస్మాన్, షేక్ షాజహాన్ ప్రాణాలు కోల్పోయారు..గిరిజనుడు ఈగ రమేష్ పక్షవాతానికి గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు
పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన రైతు పాలగిరి శ్రీనివాసులు రెడ్డి మూడు రోజులు ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై కరిముల్లాపై కేసు కూడా నమోదైవుంది
ఇప్పటికే పది కేసుల్లో ఎస్సై కరిముల్లా ముద్దాయిగా ఉన్నాడు..కాకాణి అండతో చెలరేగిపోతున్నాడు
జిల్లా ఎస్పీకి ఆ ఎస్సైపై చర్యలు తీసుకునే దమ్ములేక నిస్సహాయస్థితిలో వెనకేసుకొస్తున్నాడు
ఎమ్మెల్యేలు, మంత్రులను కాదని ఎలాంటి చర్యలు తీసుకోలేక కలెక్టర్, ఎస్పీలు డమ్మీలుగా మిగిలిపోయారు
ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రాంతాల కంటే దారుణమైన పరిస్థితులు నెలకొనడం బాధాకరం
సింహపురి గడ్డపై ఇలాంటి ఘోరమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు
ఎస్సై కరిముల్లా దారుణాలపై ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశాం..కోర్టులో కేసులూ వేస్తాం..మానవ హక్కుల కమిషన్ కూ ఫిర్యాదు చేస్తాం
అమాయక కుటుంబాల ఉసురుపోసుకుంటున్న ఎస్సై కరిముల్లాను వదిలిపెట్టే ప్రసక్తేలేదు..జైలు ఊచలు లెక్కపెట్టిస్తాం
దళిత సోదరుడు నారాయణ ప్రాణాలు బలితీసుకున్నందుకు జైలు శిక్ష అనుభవించి తీరాల్సిందే..ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
అసలు జిల్లాలో పోలీసులు ఏం విధులు నిర్వర్తిస్తున్నారో అర్థం అవుతోందా
టీడీపీ నాయకుల ఇళ్ల వందల మందిగా మొహరించడమే మీ పనా
మేం నిరసన తెలిపే క్రమంలో ఏదైనా జరిగితే మాపై కేసులు పెట్టుకోండి..చర్యలు తీసుకోండి..అంతేకానీ మేం శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే వందల మంది పోలీసులతో ఇళ్ల వద్దే అడ్డుకుంటారా
అక్రమ కేసులు బనాయించుకోండి..అంతేకానీ అమాయకులను నోటికొచ్చినట్టు బూతులు తిట్టినా, చేయిచేసుకున్నా ఊరుకునే ప్రసక్తేలేదు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసుల వైపు నుంచి ఒక్క చేయిలేస్తే మావైపు నుంచి లక్షల చేతులు లేస్తాయని గుర్తుంచుకోండి