home page

చలో నర్సీపట్నం ఉద్రిక్తం

జిల్లాలో టిడిపి నాయకుల గృహ నిర్బంధం

 | 
Meesala geetha

అయ్యన్న ఇంటి జోలికి పోవద్దు అన్న హైకోర్టు 

చలో నర్సీపట్నం ఉద్రిక్తం!!
**
జిల్లాల్లో టిడిపి నాయకులు అరెస్ట్
**
టిడిపిబిపాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ ప్రహరీ గోడను ప్రభుత్వం కూల్చేసిన విషయం రాజకీయంగా పెను దుమారం రేపింది. విశాఖ జిల్లాకు ఇరుగుపొరుగున ఉన్న జిల్లాల్లోని నాయకులు అయ్యన్నకు మద్దతుగా నిలిచేందుకు చేసిన ప్రయత్నాలను ప్రభుత్వం వమ్ము చేసింది..విశాఖ సిటీతో బాటు విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి నర్సీపట్నం బయల్దేరిన నాయకులు , మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు గృహానిర్బంధంలోకి తీసుకుంటున్నారు.దీంతో ఆయా నాయకులు నర్సీపట్నం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో అయ్యన్న కుమారుడు విజయ్ అక్కడే తన ఇంటి వద్దనే ధర్నాకు దిగారు. అది అయ్యన్న పాత్రుడి మీద దాడి కాదని, యావత్ బీసీల మీద జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు అని టిడిపి ఆరోపిస్తోంది. బీసీలపై దాడులు, హత్యలను నిరసిస్తూ టీడీపీ ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో  పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉత్తరాంద్ర వ్యాప్తంగా
 ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని గృహనిర్బంధం చేశారు. అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్దా నాగజగదీశ్వరరావుతో పాటు మరికొందరు నేతల్ని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నర్సీపట్నంలో పోలీసులు  వాహనాలను తనిఖీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో
 టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రి మృణాళిని ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరుగుపొరుగు
జిల్లాల నుంచి నర్సీపట్నం బయల్దేరిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళ్లకుండా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను, వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని హౌస్ అరెస్ట్ చేశారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యేలు కొండపల్లి అప్పలనాయుడు,  మీసాల గీత, .పాడేరులో మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలను సైతం ఇళ్లకే పరిమితం చేయడంతో నాయకులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
తన ఇంటివద్ద దీక్ష చేస్తున్న విజయ్ కు 
మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ, పీలా గోవింద్‌ వెంకట సత్యనారాయణ, కేఎస్‌న్‌రాజులు విజయ్‌ దీక్షకు మద్దతు తెలిపారు. అయ్యన్నపాత్రుడి ఇంటి దగ్గర గోడ కూల్చిన ప్రదేశాన్ని పలువురు టీడీపీ, సీపీఐ నేతలు పరిశీలించారు.  మహిళా నాయకులు
 అయ్యన్న సతీమణి పద్మావతిని పరామర్శించారు. 
ఇదిలా ఉండగా రాత్రిపూట కూల్చివేతలు నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇకముందు అయ్యన్న ఇంటి విషయంలో ఎలాంటి చర్యలకు దిగవద్దని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతానికి నర్సీపట్నంలో అయ్యన్న ఇంటివద్ద ఇంకా ఉద్రిక్తంగానే ఉంది... భారీ బందోబస్తు నడుమ 
అయ్యన్న కుటుంబం దీక్ష చేపడుతోంది..