home page

మోడి పర్యటన లో నల్లబెలూన్ కలకలం: ఇద్దరు అరెస్టు

కాంగ్రెస్ మహిళానేత పద్మశ్రీ సుంకర సాహసం

 | 
సుంకర
మోదీ పర్యటనలో నల్లబెలూన్ల కలకలం       .. కాంగ్రెస్‌ నేతలు అరెస్ట్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా హెలికాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఈ నేపథ్యంలో నల్ల బెలూన్ల వ్యవహారాన్ని భద్రతా సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు. నల్ల బెలూన్లు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. 
ప్రధాని పర్యటన సందర్భంగా బ్లాక్ బెలూన్లు ఎగరడంపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సీరియస్ అయ్యింది. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని ఎస్పీజీ స్పష్టం చేసింది. బెలూన్ల తరహాలోనే డ్రోన్లను ఎగరేస్తే పరిస్థితేంటని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్పీజీ నివేదిక కోరినట్లు తెలుస్తున్నది. 
ఈ సందర్భంగా డీఎస్పీ విజయ్‌పాల్‌ మీడియాతో మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్‌ నేతలు నల్లబెలూన్లను ఎగురవేశారు. ప్రధాని భద్రతా విషయంలో ఎలాంటి వైఫల్యం లేదు. ఇప‍్పటికే కాంగ్రెస్‌ నేత సుంకర పద‍్మ, సహా మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశాము. మిగతా వారిని కూడా గుర్తించి అరెస్ట్‌ చేస్తాము’’ అని తెలిపారు.
ప్రధాని పర్యటనలో భద్రతాపరమైన సమస్యలు సృష్టిస్తూ కాంగ్రెస్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కుట్ర పన్నిన దుష్టశక్తులను గుర్తించాలని, కాంగ్రెస్‌ నేతలపై చర‍్యలు తీసుకోవాలి అని డిమాండ్‌ చేశారు.