ఎంపీ స్థాయిని దిగజార్చిన విశాఖ ఎంపీ ఎంవీవి
జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్
పార్లమెంట్ సాక్షిగా ప్రశాంత విశాఖ పరువు తీసిన విశాఖ
ఎంపీ ఎం వి వి సత్యనారాయణ ను లోక్ సభ స్పీకర్ బర్తరఫ్ చేయాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలి
కబ్జాలు, దౌర్జన్యాలు, అసభ్య పదజాలాలతో విశాఖ పేరు చెడగొట్టేలా ఎం వి వి ప్రవర్తన
డాక్టర్ కే హరిబాబు, పురందరేశ్వరి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, టి సుబ్బరామిరెడ్డి ఎం వి వి ఎస్ మూర్తి, కణితి విశ్వనాథం వంటి మహానుభావుల పరంపరను ఎం వి వి చెడగొట్టారు
రాజకీయాల నుంచి విశాఖ నుంచి ఆయన శాశ్వతంగా తప్పుకోవటమే విశాఖకు శ్రేయస్కరం
వివాదాస్పద , కబ్జాల ఎం వి వి ప్రాజెక్టులన్నింటి పైన నిష్పక్షపాతంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కబ్జాలు, అక్రమాలు ,అక్రమణాలను తేల్చాలి
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్
విశాఖపట్నం,జూలై 21:-
విశాఖ లోక్ సభ సభ్యుడు ఎం వి వి సత్యనారాయణ గురువారం నాడు పార్లమెంట్ సెంటర్ హాల్ సాక్షిగా సహచర ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అసభ్య పదజాలంతో విరుచుకుపడి విశాఖపట్నం పరువు తీశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సాక్షిగా పార్లమెంట్లో ఎం వి వి చేసిన హడావుడి విశాఖ వాసులకే తలవంపుగా మారింది. వివాదాస్పద, కబ్జాల రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థానికంగా పేరుపడిన ఎం వి వి సత్యనారాయణ దేశంలోనే అత్యంత ముఖమైన పార్లమెంట్ సెంటర్ హాల్లో బూతు పురాణాన్ని అందుకొని తనతో పాటు తాను ప్రాతినిధ్యం ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు , విశాఖ పరువు కూడా తీశారు. దీనిపై ఇప్పటికే సహచర ఎంపీ రఘురామకృష్ణం రాజు లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఎం వి వి సత్యనారాయణ ప్రవర్తనను తప్పుపడుతూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇది విశాఖకే కాదు ఆంధ్రప్రదేశ్ కు, రాష్ట్రాన్ని పాలిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు.
విశాఖ లోక్ సభ సభ్యునిగా విశాఖ వాసులు గుర్తుంచుకునే ఒక్క మంచి పని చేయని ఎం వి వి - ఎంపీ హోదాను దుర్వినియోగం చేస్తూ వృద్ధుల కోసం కేటాయించిన హైగ్రీవ ప్రాజెక్టు ను కబ్జా చేశారు. శతాబ్దాల కాలంగా క్రైస్తవ సంస్థ చేతిలో ఉన్న సి బి సి ఎన్ సి భూములను కొల్లగొట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 99:1 ఒకటి నిష్పత్తితో కూర్మన్నపాలెంలో భారీ వెంచర్ వేశారు. ఆ వెంచర్ కోసం ఎం వి వి స్మశానాన్ని పార్కును రైవాడ కాల్వ భూములను కబ్జా చేశారంటూ ఇటీవల స్పందనలో జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. గతంలో తమ భూములను ఎం వి వి కబ్జా చేశారంటూ ఒక పోలీసు అధికారి ఫిర్యాదు చేశారు. భూకబ్జా కారణంగానే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎం వి వి అరెస్టై విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లిొచ్చారు. ఈయన కార్యకలాపాలను గమనించి అప్పటి పోలీసులు రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు.
ఈ పరిస్థితులను నేపథ్యంలో ఎం వి వి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతం సహజంగానే పలు అనుమానాలకు అవకాశం కల్పించింది. అదే అనుమానాన్ని విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు, సాటి లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణం రాజులు వ్యక్తం చేశారు. రకరకాల అనుమానాలతో పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. కిడ్నాప్ గురైన ఎం వి వి కుటుంబ సభ్యులు కానీ, కిడ్నాప్ ను చేదించిన నగర పోలీసులు గాని ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను అందజేయకపోవటమే ఈ అనుమానాలకు కారణం. అనుమానాలు కలిగే విధంగా రకరకాల కథలు చెప్పి, విశాఖలో వ్యాపారాలు కూడా చేయనని ప్రకటించి ఎం వి వి కొత్త అనుమానాలను రేకెత్తించారు. దానిపై ఎవరూ మాట్లాడకూడదు అన్నట్టుగా సాటి లోక్ సభ సభ్యుడిపై దౌర్జన్యానికి దిగటం అసభ్య పదజాలంతో దూషించటం సిగ్గుచేటు. ప్రశాంతమైన విశాఖ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎం వి వి ప్రవర్తన తీరు విశాఖ వాసులకే తలవొంపులుగా మారాయి.
వివాదాలకు, కబ్జాలు ,ఆరోపణలకు కేంద్ర బిందువైన విశాఖ ఎంపీ ఎం వి వి సత్యనారాయణ పై లోక్ సభ స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకొని ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను మార్చుకున్న క్రమంలో ఎం వి వి సత్యనారాయణ లాంటి కబ్జా కోరు అధికార పార్టీలో ప్రతినిధిగా ఉండటం ఆ పార్టీకే సిగ్గుచేటు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తక్షణమే స్పందించి విశాఖ ఎంపీ ఎం వి వి సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించాలని కోరుతున్నాం. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎం వి వి లాంటివారు ఏ పార్టీకైనా చీడపురుగే అవుతారు. అటువంటి వ్యక్తులకు ఏ రాజకీయ పార్టీ కూడా ఆశ్రయం కల్పించకూడదు.
ఎం వి వి సత్యనారాయణ చేపట్టిన హైగ్రీవ, సి బి సి ఎన్ సి, కూర్మన పాలెం వెంచర్లపై ఫిర్యాదులు ,హైకోర్టులో కేసులు ఉన్నాయి. తక్షణమే వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిరిపురం సి బీ సి ఎన్ సి స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఆయన రెండు లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ మైనింగ్ చేసి తరలించికెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. హైగ్రీవాలో అంతకంటే రెట్టింపు సంఖ్యలో గ్రావెల్ తరలింపులు జరిగాయి. మైనింగ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి వీటిపై వాస్తవాలను వెల్లడించాలి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. స్పందనలో అందుకు ఫిర్యాదు ఆధారంగా కూర్మన్నపాలెం సంబంధిత రెవెన్యూ మరదల శాఖ విఎమ్ఆర్డిఏ సంస్థలు స్పందించాలని కోరుతున్నాం. ఈ మూడు స్థలాలను ఎం వి వి సత్యనారాయణ స్థల యజమానులను బెదిరించి భయపెట్టి అధికార దుర్వినియోగం తో స్వాధీనం చేసుకున్నరానే ఆరోపనలు ఉన్నాయి. వీటిపై ఫిర్యాదులు ఉన్నాయి. విచారణ జరపడం ద్వారానే వాస్తవాలు బయటికి వస్తాయి. అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.