లోకేష్ పాదయాత్ర ను అడ్డుకుంటే ఊరుకోం : పాతర్ల రమేష్
Mar 4, 2023, 21:51 IST
|
*లోకేష్ పాదయాత్ర యువగళం పాదయాత్రను ఆపాలని చూస్తే చూస్తూ ఊరుకోం,,* _పాతర్లరమేష్_ అమరావతి మార్చి 4 (న్యూస్ బ్యూరో ) లోకేష్ యవగళం పాదయాత్ర ను ఆపేందుకు వైసీపీ ప్రణాళికలు వేయడం దుర్మార్గమైన చర్యని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ విమర్శించారు, అమరావతిలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైసీపీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని ఆయన అన్నారు, చిత్తూరు జిల్లా కల్లూరు లో లోకేష్ పాదయాత్ర వస్తుంటే పోలీసులు షాపులు మూయించటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు, లోకేష్ యవగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను, స్పందనను చూసి, వైసిపి నాయకులు ఓర్చుకోలేక లోకేష్ యవగళం పాదయాత్రను ఎలాగైనా ఆపాలని పోలీసులతో ఓవరాక్షన్ చేస్తున్నారని ఆయన విమర్శించారు, వైసీపీ ప్రభుత్వం ఎన్ని పిచ్చి పిచ్చి పనులు చేసిన లోకేష్ యవగళం పాదయాత్ర 4000 కిలోమీటర్లు విజయవంతంగా ముగుస్తుందని ఆయన జోస్యం చెప్పారు, వైసిపి నాయకులు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం అవుతుందన్నారు, ఎంపి లో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎన్నికల కోడ్ పేరుతో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని, బ్యానర్లు కనబడకుండా రోడ్డు ప్రక్కన తెరలు కడుతున్నారని ఆయన విమర్శించారు,. *ఇప్పటం గ్రామంలో కూల్చివేతలు నిలిపివేయండి* ,,. మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో గ్రామంలో ఇల్లు కూల్చివేత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ అన్నారు,. ఇప్పటం గ్రామంలో 4వేల జనాభా ఉన్న గ్రామంలో 120 అడుగుల రోడ్డు అవసరమా ? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు వేయటం అంటే, ఆ గ్రామానికి విమానాలు ఏమైనా వస్తాయా అని ఆయన ప్రశ్నించారు, ఇప్పటం గ్రామం ప్రజలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఇప్పటంలో ఇల్లు కూల్చివేత కక్ష సాధింపు చర్యే అని, ఇల్లు కూల్చివేతను వెంటనే నిలుపుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,