home page

రవాణాశాఖలో శాఖ కార్యదర్శిగా తెలుగు తేజం- రవి ప్రసాద్

ఆంధ్రా వాసికి అత్యున్నత స్థానం  

 | 
 raviprasad

కేంద్ర రవాణా శాఖ మంత్రిత్వశాఖ కార్యదర్శిగా రవి  ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు  .ఇప్పటివరకు  డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహించారు .

 ఆంధ్రప్రదేశ్‌లో  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రవి ప్రసాద్  రవాణా మంత్రిత్వ శాఖలో  సీనియర్ అధికారి  .గతంలో హైదరాబాద్లో రీజినల్ అధికారిగా,  చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు .  1988 సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీస్‌   అధికారిగా  పనిచేసిన  రవి ప్రసాద్ రవాణాశాఖలో మంచి పట్టుంది . పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గర్లోని  జీ కోడేరు    ఆయన సొంత గ్రామం . తాడికొండ స్కూల్లో విద్యనభ్యసించి రవి ప్రసాద్ తర్వాత రూర్కీలోని  ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయం నుంచి  మాస్టర్ డిగ్రీ పొందిన ఆయన బంగారు పతకాన్ని సాధించారు  . గత రెండు సంవత్సరాలుగా రవాణా మంత్రిత్వ శాఖలో అదనపు డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహించారు .