home page

విశాఖలో పవన్ పవర్ !

దారి పొడవునా  జన హోరు  

 | 
జానాసెనా

విశాఖ పర్యటనకు వచ్చిన పవన్‌కు జనసైనికులు అపూర్వ స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి ఆయన హోటల్‌కు వెళ్లే వరకూ స్వాగతం చెప్పారు. దారి పొడుగూతా జనం కనిపించారు.

మూడు రాజధానులకు వైసీపీ మంత్రులు మంత్రులు తరిలించుకువచ్చిన వారి కన్నా రెట్టింపుగా స్వచ్చందంగా పవన్ కల్యాణ్‌ కోసం ఫ్యాన్స్ తరలి వచ్చారు. జనసేన కార్యకర్తల్లో ఓ కసి కనిపించింది. పవన్ ను విశాఖ రావొద్దన్న వైసీపీ నేతల మాటలతో పాటు.. ఇష్టారీతిన మాట్లాడుతున్న వారికి కౌంటర్ ఇవ్వాలన్న కసితో వచ్చారు.

జనసేన నేతలు కావాలని జన సమీకరణ చేసింది లేదు. స్వచ్చందంగానే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎవరికీ రూపాయి ఇవ్వలేదు. కనీసం వారి వాహనాలకు ఏ ఒక్క నేత పెట్రోలు కూడా కొట్టించలేదు. పవన్ ఫ్యాన్స్ హంగామా చేయదల్చుకుంటే ఎలా ఉంటుందో చూపించారు. నిజంగా పవన్ కల్యాణ్ ప్రదర్శనకు పిలుపునిచ్చి ఉంటే అంతకంటే ఎక్కువగానే జనం వచ్చేవారు. కానీ పవన్ ఎలాంటి ప్రదర్శననకు పిలుపునివ్వలేదు. ఎలాంటి గర్జనలు పెట్టలేదు. కేవలం స్వాగత కార్యక్రమాలకే అలా వచ్చారు.

విశాఖలో మరో రెండు రోజుల పాటు పవన్ ఉంటారు. జనవాణిలో అర్జీలు తీసుకుంటారు. ఈ రెండు రోజులూ విశాఖలో పవన్ హడావుడి కనిపించడం ఖాయం. మూడు రాజధానుల సెంటిమెంట్ అసలు లేకపోగా.. వైసీపీ నేతల ఆకృత్యాలపై ప్రజలు చాలా అసహనంతో ఉన్నారని .. తాజా పరిణామాలతో తేలిపోయిందని. సామాన్య ప్రజలు కూడా గుసగుసలాడుకుంటున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్..ఎలాంటి గర్జన లేకుండా కేవలం. ఎంట్రీతోనే వైసీపీకి మించిన బల ప్రదర్శన చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.