NELLORE RAILWAY WORKS will complete by May 2023
Nov 16, 2022, 22:52 IST
| 'నెల్లూరు రైల్వే స్టేషన్ శంకుస్థాపనకే పరిమితం' అనే శీరిక్షతో కథనానికి దక్షిణ మధ్య రైల్వే పబ్లిక్ రిలేషన్ అధికారి నజ్రత్ ఎం.మంద్రూప్‌కర్ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. 2019లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. 2022 ఆగస్టు 17న రూ.102 కోట్లతో కాంట్రాక్టు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం ప్రతి రోజూ 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, ఈ పనులు పూర్తి చేస్తే 40 నుంచి 50 వేల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తారని పేర్కొన్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్ అధునికీకరణ పనులు పూర్తి చేసి, నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్పప్నం తీర్చుతామని తెలిపారు.