విశాఖలో గజం స్ధలం కూడా అమ్మకం కానివ్వం

పరిపాలనా రాజధాని ముసుగులో ఖరీదైన భూములు అమ్మకమా.. ?

గజం స్థలం కూడా అమ్మడానికి కుదరదు – సీపీఐ

విశాఖపట్నం:- విశాఖ నగరం లో అత్యంత ఖరీదైన బీచ్‌ రోడ్డులో 13.59 ఎకరాల స్థలం ఎ పి బిల్డ్ పేరిట అమ్మకాలు చేసే ప్రయత్నం వెనక్కి తీసుకోవాలని సీపీఐ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి ఎం పైడిరాజు బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

గత టీడీపి ప్రభుత్వం లులూ గ్రూపుకి కట్టబెట్టాలన్న ప్రయత్నాలను సీపీఐ తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆందోళన లో వైసీపీ కూడా పాల్గొన్నదని, ప్రతిపక్ష నేత హోదాలో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ లులూ సంస్థ కి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి అక్కడ ప్రజా ప్రయోజనాలకు ఉపయోగకరమైన నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చిన అంశాన్ని గుర్తు చేస్తూ నేడు అమ్మకాలు చేయాలని చూడడం దుర్మార్గం అన్నారు.దీనిని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, కలిసివచ్చే అన్ని పార్టీలను కలుపుకొని ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

విశాఖ నగరం చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని ప్రభుత్వానికి సిత్తశుద్ది ఉంటే వాటన్నింటినీ తీసుకొని ప్రభుత్వం ప్రజా అవసరాలకు ఉపయోగించాలని సీపీఐ తరుపున విజ్ణపి చేశారు. ఈనెల 09 వ తేదీన జరిగే జీవీఎంసీ పాలకవర్గం సమావేశంలో ప్రభుత్వ భూములు అమ్మడానికి వ్యతిరేకంగా తీర్మానం చెయ్యాలని పైడిరాజు డిమాండ్ చేసారు.

Comments (0)
Add Comment