home page

సర్పపూజకు ఉద్దిష్టమైన నాగులచవితి

నేడు నాగులచవితి  

 | 

*సర్ప పూజకు ఉద్దిష్టం నాగుల చవితి*

కార్తీక శుక్ల పక్ష చవితిని
”నాగుల చవితి” అని పిలుస్తారు.
ఇది సర్పపూజకు ఉద్దిష్టమైన దినం.
కార్తీక శుద్ధ చవితినాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెపుతున్నది. శ్రీనాధుని శివరాత్రి మహాత్మ్యంలో ఇలా వర్ణింపబడినది.

”చలి ప్రవేశించు నాగుల చవితి నాడు,
మెరయు వేసవి రథసప్తమీ దివసమున,
అచ్చ సీతు ప్రవేశించి బెచ్చు పెరిగి,
మార్గశిర పౌష మాసాల మధ్యవేళ.”

పై గీతాన్ని బట్టి నాగుల చవితి కార్తీక మాసంలో వస్తుందని అర్ధమవుతున్నది. నాగులు, గరుడులు, వానరులు, రాక్షసులు, అసురులు వీరంతా వేరువేరు జాతుల వారంటారు మానవ శాస్త్రజ్ఞులు. అస్సాం దక్షిణ భాగంలో ఉన్న నాగాయ్‌ కొండలలో ఇప్పటికీ నాగజాతి వారున్నారు. నాగులకు, ఆంధ్రులకు ప్రాచీ న కాలము నుండి విశేష సంబంధముంది. భారతా వనిలో అనేక ప్రదేశాలలో నాగజాతి వారున్నట్లు చరిత్ర చెపుతున్నది. కాశ్మీర రాజులు తాము కర్కోటక నాగరాజు సంతతి వారమని చెప్పుకునే వారు. నాగ పూరు రాజన్యులు తాము పుండరీక నాగరాజు సంత తికి చెందిన వారమని ప్రకటించుకునే వారు. ఆంధ్రు లూ నాగజాతి వారనే వాదన కూడా లేకపోలేదు. బౌద్ధ ధర్మమంటే నాగులకు ఆనురక్తి ఉన్నట్లు, బుద్ధు నికి పరమ భక్తులై నాగులు బౌద్ధాన్ని ఆదరించి, అవ లంబించారని బౌద్ధ వాజ్మయంలో అనేక గాథలు తెలుపుతున్నాయి.

ఏలాపత్ర నాగుడు, ముచిలింద నాగుడు మొద లైన వారు బౌద్ధ మల చిత్రాలున్నాయి. ప్రాచీనాం ధ్రులు నాగులను కటి ప్రదేశం నుండి పైభాగమంతా మనిషి రూపంలో, క్రింది భాగమంతా సర్ప రూపా లలో చెక్కారు. నాగరాజు చిత్రాలకు తలపైన ఐదు పడగలుంటాయి. నాగినికి ఒక్కటే పడగ. భారతా వనిలో నాగపూజ ఆది నుండీ ఆచరణలో ఉంది. గౌతముడు తన గృహ్య సూత్రాలలో పేర్కొనగా యజ్ఞ మంత్రాలలో నాగుల స్తుతి పేర్కొనబడింది. నాగ శిలలు, నాగ కల్లులూ, ప్రతిమలు ప్రతి చోట దర్శన మిస్తాయి. పుట్టిన బిడ్డలు చనిపోతుంటే సంతా నం నిలవడానికి నాగ ప్రతిష్ఠలు చేయడం ఆరాధించ డం ఆచారంగా ఉంది. పాములు భూమి అంతర్భా గమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణు లుగా సమస్త జీవకోటికి ”నీటిని” ప్రసాదించే దేవత లుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమి కీటకాదులను తింటూ, పరోక్షంగా ”రైతు”కు పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయ పడుతూ ఉంటాయి. ఆది నుండీ ఆంధ్రులు, నాగారాధకులుగా ఉన్నారు.

”నన్నేలు నాగన్న నాకులమునేలు, నాకన్న వారల, నాయింటి వారల, అప్తుల మిత్రుల, నందర ను నేలు, పడగ దొక్కిన, పగ వాడనుకోకూ, నడుము దొక్కిన నావాడను కొనుమూ తోక తొక్కిన తొలగుచు పొమ్ము, ఇదిగో! నూక నిచ్చెదను మూకను నాకిమ్ము, పిల్లల మూకను నాకిమ్ము” అని నాగేశ్వరుని ప్రార్థించ డం ఆనవాయితీగా ఉంది. ఐదు తలల పాములను వెండితోగాని, మట్టితోనైనా చేసి పూజించడం ఆచా రం. చెవిలో చీము పట్టినా, వినపడక పోయినా, చెవు లను బంగారు, వెండితో చేయించి శివాలయాలకు సమర్పించడం పరిపాటిగా ఉంది.

అనంత, వాసుకి, శేష, పద్మనాభ కంబల, కర్కో టక, అశ్వతర, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళీయ, తక్షక, పింగళి అని 12రకాల సర్పాలను ఒక్కొక్క నెలలో పూజించడం ప్రాచీన సాంప్రదాయంగా ఉండేది. ప్రపంచంలో శాస్త్రవేత్తలకు తెలిసి దాదాపు అన్ని రకాల పాములున్న దేశం భారతదేశమే. మానవుని మానసిక శక్తికి హందూదేశంలో పాము చిహ్నంగా ఉంది.

మానసిక శక్తికి వేదాంత పరిభాషలో కుండలినీ శక్తి అని పేరు. నిస్సంగుల తపస్సు అంతా ఈ కుండలినీ శక్తిని లేపు టకే. కుండలినీ శక్తిని గ్రీకు భాషలో ”స్పీరిమా” అం టారు. స్పీరిమా అంటే సర్ప వలయం. కుండలినిని సర్పంటైన్‌గా పిలుస్తారు. శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటా రు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నె ముకను ‘వెన్నుబాము’ అని అంటారు. మూలాధా రం నుండి సహస్రారము వరకు వెన్నెముక మధ్య నుండి సర్పాకారముగ కుండలినీ శక్తి అనబడు సుషు మ్నా నాడిని లేవ జూపడమే నాగపూజ ప్రధాన ఉద్దేశ మని విజ్ఞుల భావన. కుండలినీ శక్తి మూలాధార చక్రంలో ”పాము” ఆకారమువలెనే వుంటుందని ”యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటి స్తూ… కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్స ర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్య క్షంగా విష సర్ప పుట్టలను ఆరాధిస్తారు. పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృద యాలలో నివసించే ‘శ్రీమహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరిక తో చేసే సత్కర్మనే నాగుపాము పుట్టలో పాలు పోయుటలో గల అంతర్యమని భావన.