ఆసక్తికరంగా ‘మా’ఎన్నికలు: ఎత్తులు పైఎత్తులు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నాయి. రెండుమూడు నెలల నుంచే వాదప్రతివాదనలూ , విసృతప్రచారాలు జరిగాయి. అక్టోబర్ 10 న ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ , మంచు విష్ణు ప్యానెల్ పోటీపడుతున్నారు. ప్రకాష్ రాజ్ ‘తెలుగు మా అధ్యక్ష పదవి’కి పోటీ చేయడం ఏమిటి ? అతని కంటే నేనే బాగా పని చేస్తాను అంటూ మంచు విష్ణు డైరెక్ట్ గానే కామెంట్స్ చేశాడు.

ఈ క్రమంలోనే విష్ణు ‘ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నాడా.. లేక పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడా’ అంటూ కామెంట్స్ చేయడం, ఆ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇస్తూ ‘పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్స్ అంత ఉండవు, నీ సినిమా బడ్జెట్’ అంటూ విష్ణును తగ్గించి మాట్లాడటం.. మొత్తానికి ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. మరి ఈ గ్యాప్ లో ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడిపోతారు ? అనేదే ఇప్పుడు ప్రధాన టాపిక్ అయింది.

తెలుగు సినిమా రంగ నటీనటుల సంఘంలో ప్రకాష్ రాజ్ కి పెద్దగా పట్టు లేదు. కాకపోతే మెగా కాంపౌండ్ నుంచి ఆయనకు మద్దతు ఉంది. అందుకే, మా ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో ప్రకాష్ రాజ్ కి మద్దతు దారులు పెరిగారు. ఇక మంచు ఫ్యామిలీకి నటీనటులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ, విష్ణు, పవర్ స్టార్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం కొంతమందికి నచ్చలేదు.

అయితే మంచు విష్ణు మాత్రం గెలిచే దారులు వెతుక్కుంటూ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. మరోపక్క ప్రకాష్ రాజ్ గత రెండు నెలలుగా సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇన్నాళ్లు మెగాస్టార్ ఎవరికీ సపోర్ట్ చేస్తే వారు గెలిచే అవకాశం ఉంది అన్నారు. కానీ ఒక్క మెగాస్టార్ మద్దతు ఉంటే సరిపోదు. ఎన్నికల్లో గెలవాలంటే బాలయ్య మద్దతు చాలా అవసరం.

ఎందుకంటే ‘మా’ మెంబర్స్ లో బాలయ్య వర్గమే ఎక్కువగా ఉన్నారు. అందుకే మంచు విష్ణు, మొదటి నుంచి తాను బాలయ్య మనిషిని అంటూ ముందుకు వెళ్తున్నాడు. బాలయ్య కూడా విష్ణుకే సపోర్ట్ చేసేలా ఉన్నాడు.

సరే అందరి కంటే.. సిట్టింగ్ అధ్యక్షుడు నరేష్ మద్దతు కూడా విష్ణుకి బాగా కలిసి వచ్చేలా ఉంది. గత కరోనా, అలాగే ఈ కరోనా టైమ్ లో నరేష్ తన వర్గానికి చెందిన రెండు వందల మందికి అవసరం ఉన్నప్పుడు అండగా నిలబడ్డారు. తన వర్గంలో ఒక్కరు కూడా చేజారకుండా నరేష్ జాగ్రత్త పడ్డాడు. కాబట్టి, నరేష్ మద్దతు మంచు విష్ణు ప్యానెల్ విజయాన్ని నిర్ణయించే అవకాశం వుంది.

మంచు విష్ణుకి మొదటి నుంచి నరేషే మద్దతు వుంది కాబట్టి, నరేష్, బాలయ్యల మద్దతు  ‘మంచు విష్ణు’కి సంపూర్ణంగా దొరికితే విష్ణు ప్యానెల్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా మోహన్ బాబు అందరి మద్దతు కోసం ప్రయత్నాలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.