కలెక్షన్ల వరదలో ‘లవ్ స్టోరీ’

అక్కినేని హీరో నాగ చైతన్య,  సాయి పల్లవి  ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’  సెప్టెంబర్ 24 వ తేదీనుంచి అన్ని థియేటర్స్‌లో  అదిరిపోయే కలెక్షన్స్‌ను వసూలు చేస్తోంది. ఏడు రోజులకు ఈ సినిమా దాదాపు ముప్పై కోట్లకు పైగా వసూలు చేసింది.

అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టొరీ’ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో  రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని వసూళ్ళు చేసింది. ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందని తెలుస్తోంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.8 కోట్ల మార్క్ ని అందుకుంది.

ఇక లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ సక్సెస్ ఫుల్‌గా ముగించింది. కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి అనుకోని అవరోధాల కారణంగా కలెక్షన్స్ తగ్గాయి. ఈ సినిమాకు 4 వ రోజు నుండి గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ వలన కలెక్షన్స్‌కి గట్టి దెబ్బే తగిలింది. ఈ సినిమా ఐదవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. 4 వ రోజు 2.52 కోట్ల షేర్ ని అందుకున్న లవ్ స్టోరి సినిమా అయిదవ రోజున కేవలం 1.26 కోట్ల షేర్ సాధించింది.

లవ్ స్టోరీ రోజువారీ గా ఏపీ తెలంగాణల్లో వసూళ్ళు: మొదటి రోజు – 7.13 కోట్లు ,రెండవ రోజు- 5.08 కోట్లు ,మూడోవ రోజు- 5.19 కోట్లు ,నాల్గవ రోజు- 2.52 కోట్లు ,ఐదవ రోజు- 1.26 కోట్లు,ఆరవ రోజు- 66 లక్షలు,ఏడవ రోజు – 39 లక్షలు కలిపి ఏపీ తెలంగాణ మొత్తం:- 22.23 కోట్లు. (36.10 స్థూలంగా)వసూలు చేసింది.

నైజాం: 10.58 కోట్లు  ,సీడెడ్ : 3.56 కోట్లు

UA: 2.48 కోట్లు , ఈస్ట్ : 1.35 కోట్లు ,

వెస్ట్ 1.13 కోట్లు. గుంటూరు: 1.30 కోట్లు ,కృష్ణా: 1.12 కోట్లు , నెల్లూరు: 71 లక్షలు

ఆంధ్ర  ,తెలంగాణ కలిపి :- 22.23 కోట్లు (36.10CR గ్రాస్), కర్నాటక, ఇతర ప్రాంతాలు 1.42 కోట్లు, ఇతర రాష్ట్రాలు: 4.51 కోట్లు వసూలు కాగా ప్రపంచ వ్యాప్తంగా వసూలైన మొత్తం : 28.16కోట్లు. (50.05 కోట్లు. గ్రాస్)

ఈ సినిమాను మొత్తం గా 31.2 కోట్లకి అమ్మగా  బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే వారం రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 3.84 కోట్ల షేర్ అందుకుంటే ఈ సినిమాకు అయిన వ్యయం వసూలు అయ్యినట్లే. సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు అయ్యాయి.

నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల  దర్శకత్వంలో వచ్చిన ప్రాజెక్ట్ కావడంతో పాటు మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ కావడం కారణంగా లవ్ స్టోరీ పై అంచనాలను మరింతగా పెరిగాయి.

వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ పాట మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.

Leave A Reply

Your email address will not be published.