సంచలనం కలిగించిన సమంతా విడాకులు!

సమంత ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ పెద్దింటి కోడలిగా అడుగుపెట్టిన సమంత గత నాలుగు సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలోఎంతో సంతోషంగా గడిపిన నాగ చైతన్య సమంతల మధ్యగత కొంత కాలం నుంచి మనస్పర్థలు తలెత్తాయని ఈ క్రమంలోనే వీరిద్దరు విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తల్లో నిజం లేదని అభిమానులు భావించినప్పటికీ నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకుంటున్నామని తెలిపారు. చైతూ సమంతా విడాకుల వ్యవహారం పరిశ్రమను కుదిపేస్తోంది. సమంతాకు మద్దతుగా కొంతమంది స్పందించారు. మరికొంత మంది సానుకూలంగా స్పందించారు. మొత్తం మీద విడాకుల వ్యవహారం అక్కినేని కుటుంబాన్ని కలవర పెడుతోంది. గతంలో నాగార్జున వివాహం కూడా వివాదాస్పదమయ్యింది. సినీ నిర్మాత రామానాయుడు తో బంధుత్వం , ఆ తర్వాత అమలను నాగార్జున వివాహం చేసుకోవడం అప్పట్లో సంచలనం. ఇప్పుడు నాగార్జున కొడుకు నాగ చైతన్య ప్రేమవ్యవహారం, పెళ్ళి , ఇప్పుడు విడాకులు అంతా సంచలనమే.

Leave A Reply

Your email address will not be published.