బద్వేలు బరిలో బిజెపి: సోము వీర్రాజు

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో బిజెపి పోటీలో ఉంటుందని బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. జిల్లానాయకులు , బద్వేలు నియోజకవర్గ నాయకులతోను చర్చించి అభ్యర్ధి పేరు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. ఏడేళ్లు గా కేంద్రం రాష్ట్రంలో భారీగా నిధులు వ్యయం చేస్తోందని ఆయన చెప్పారు. బద్వేలు సమీపంలో రెండు జాతీయ రహదారులకు కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. జగన్, చంద్రబాబు ఈ ప్రాంతంలో ఎక్కడైనా రోడ్లు వేశారా?అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ఏడు ఏళ్లుగా నరేంద్ర మోదీ నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారని ఆయన తెలిపారు..రాష్ట్రంలో ఏడేళ్ల అభివృద్ధి పై చర్చించడానికి బీజేపీ సిద్ధమని. జగన్, చంద్రబాబుకు దీనిపై చర్చించడానికి సిద్ధమా.? అని సోము సవాల్‌ విసిరారు. బద్వేలు అసెంబ్లీ అంతా గోతుల మయమని ఆయన మండి పడ్డారు. మద్యపానం నిషేధం అని చెప్పిన జగన్ 20 రూపాయల సీసా రూ.200 లకు జగన్ అమ్ముతున్నాడని ఆయన ఆరోపించారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని బీజేపీ ప్రోత్సహించదని ఆయన చెప్పారు. బద్వేలు ఉపఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.